Actor : ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లతో కలిసి నటించిన ఏకైక టాలీవుడ్ హీరో.. ఫాలోయింగ్ చూస్తే..

Actor : ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లతో కలిసి నటించిన ఏకైక టాలీవుడ్ హీరో.. ఫాలోయింగ్ చూస్తే..


పైన ఫోటోలో కనిపిస్తున్న ముగ్గురు హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పాపులారిటీ సంపాదించుకున్న స్టార్స్. తక్కువ సమయంలోనే అగ్ర హీరోలకు జోడిగా నటించి మెప్పించారు. ముఖ్యంగా హీరోయిన్ నగ్మా.. అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ భాషలలో అగ్ర హీరోలకు జోడిగా నిటంచింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఎక్కువగా స్టార్ హీరోలతో ప్రేమ, డేటింగ్ అంటూ నిత్యం వార్తాలలో నిలిచింది. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది. ఇక నగ్మా చెల్లెలు జ్యోతిక సైతం టాప్ హీరోయిన్. తెలుగులో కంటే ఎక్కువగా తమిళంలోనే కథానాయికగా రాణించింది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి: Actress : బాబోయ్.. సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ రచ్చ.. సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..

నగ్మా, జ్యోతిక ఇద్దరూ అక్కాచెల్లెళ్లు అన్న సంగతి తెలిసిందే. ఇక వీరికి మరో సోదరి కూడా ఉంది. ఆమె సైతంత ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా సత్తా చాటింది. ఆమె పేరు రోషిణి. తమిళంలో ఎక్కువగా చిత్రాల్లో నటించింది. అయితే ఈ ముగ్గురు టాప్ హీరోయిన్లతో నటించిన ఏకైక టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా.. ? ఆయన మరెవరో కాదు.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లతో కలిసి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు చిరు.

ఇవి కూడా చదవండి: Ajith Kumar: అజిత్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? పాన్ ఇండియా హీరో కమ్ విలన్.. ఎవరంటే..

అసలు విషయానికి వస్తే.. చిరంజీవి, నగ్మా కాంబోలో ఘరానా మొగుడు, రిక్షావోడు, ముఠామేస్త్రి వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇక జ్యోతిక, చిరు కాంబోలో వచ్చిన ఠాగూర్ సినిమా ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. అలాగే హీరోయిన్ రోషిణితో కలిసి చిరు మాస్టర్ చిత్రంలో నటించారు. అలాగే ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లతో కలిసి నటించిన ఏకైక హీరోగా చిరంజీవి నిలిచారు. రోషిణి, నగ్మా సినిమాలకు దూరంగా ఉండగా.. జ్యోతిక మాత్రం వరుస సినిమాల్లో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్‏తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి: Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *