కేంద్ర ప్రభుత్వం కొత్త ఆధార్ యాప్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి చివరి వారంలో ఈ యాప్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ వెర్షన్లలో ఈ యాప్ అందుబాటులో ఉంది. ఆధార్ పేరుతో ఈ యాప్‌ను లాంచ్ చేశారు. ప్రస్తుతం ఆధార్‌లోని వివరాలు ఆన్‌లైన్‌లో అప్డేట్ చేసుకోవాలంటే యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. ఇక సమీపంలోని ఆధార్ సెంటర్లను సందర్శించి ఆఫ్‌లైన్ విధానంలో వివరాలు మార్చుకోవచ్చు. కానీ మొన్నటివరకు యాప్ అందుబాటులో లేకపోగా.. ఇప్పుడు ఆ సౌకర్యం కూడా యూఐడీఏఐ కల్పిస్తోంది. ఈ కొత్త యాప్ ద్వారా ఆధార్ అడ్రస్ ఎలా మార్చుకోవాలో చూద్దాం.
అడ్రస్ మార్చుకోవడం ఈజీ
-గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి
-ఆధార్ పేరుతో ఉండే యూఐడీఏఐ రూపొందించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
-ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఇతర వివరాలను ఉపయోగించి యాప్‌లోకి లాగిన్ అవ్వండి
-ఇక యాప్ ఓపెన్ చేయాడానికి ఎం-పిన్ లేదా ఫేస్ రికగ్నిషన్ సెటప్ చేసుకోండి
-ఆ తర్వాత యాప్ మొయిన్ ఇంటర్‌ఫేస్ ఓపెన్ అవుతుంది
-సేవలు అని కనిపించే ఆప్షన్‌ను ఎంచుకుండి
-చిరుమానా అప్‌డేట్ ఆప్షన్ ఎంపిక చేయండి
-అడ్రస్ అప్డేట్ చేసుకోవడానికి ఇంటి చిరునామా రుజునామా పత్రాన్ని అప్‌లోడ్ చేయండి
-స్కాన్ చేసి అప్‌లోడ్ చేయవచ్చు.. లేదా ఫోల్డర్‌లో ఉండే అప్‌లోడ్ చేయవచ్చు
-లేదా అదే చిరుమానాలో ఉన్న మీ కుటుంబసభ్యుల వివరాలు ఇవ్వండి
-కొత్త అడ్రస్ వివరాలు ఎంటర్ చేయండి
-ఆ తర్వాత ఫేస్ రికగ్నిషన్ ద్వారా మీ ముఖాన్ని ధృవీకరించండి
-రూ.75 రుసుం డిజిటల్ పేమెంట్స్ ద్వారా చేయండి
-ఆ తర్వాత యూఐడీఏఐ మీ వివరాలు వెరిఫై చేస్తుంది
-వివరాలు కరెక్ట్ అని భావిస్తే అప్లికేషన్ ప్రొసీడ్ చేస్తుంది
-కొత్త ఆధార్ కార్డు మీకు పోస్ట్ ద్వారా అందుతుంది
-కొత్త ఆధార్‌లో మీ అడ్రస్ అప్‌డేట్ చేసి ఉంటుంది
-ఒకవేళ మీరు తప్పుగా వివరాలు అందిస్తే అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు
సమయం ఆదా
ప్రస్తుతం గ్రామాల్లో ఆధార్ సెంటర్లు అందుబాటులో లేవు. దీంతో ఆధార్‌లోని వివరాలు మార్చుకోవాలాంటే సమీపంలోని పట్టణానికి వెళ్లాల్సి వస్తుంది. ఆధార్ సెంటర్ల వద్ద గంటలపాటు క్యూలైన్లలో నిల్చోవాల్సి ఉంటుంది. ఇక వికలాంగులు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు క్యూలైన్లలో నిల్చోవాలంటే కష్టతరమైన పని. ఇప్పటినుంచి మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా పట్టణాలకు వెళ్లాల్సిన పని లేదు. సులువుగా మొబైల్ నుంచే ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.