OTT Movie: నరమాంస భక్షకులుగా మారే ఖైదీలు.. ఓటీటీలో దిమ్మతిరిగే సస్పెన్స్ థ్రిల్లర్.. మస్ట్ వాచ్ మూవీ

OTT Movie: నరమాంస భక్షకులుగా మారే ఖైదీలు.. ఓటీటీలో దిమ్మతిరిగే సస్పెన్స్ థ్రిల్లర్.. మస్ట్ వాచ్ మూవీ


సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలు భాషతో సంబంధం లేకుండా అందరి ఆడియెన్స్ ను ఆకట్టుకుంటాయి. అందుకు తగ్గట్టుగానే పలు ఓటీటీ సంస్థలు వివిధ భాషల్లో హిట్ అయిన సినిమాలను ఆయా భాషల్లోకి అనువాదం చేసి స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్. స్పానిష్‌లో విడుదలైన ఈ చిత్రానికి కాల్డర్ కాస్టెలు-ఉరుటియా దర్శకత్వం వహించారు. డేవిడ్ డెసోలా తాను రాసిన కథకు పెడ్రో రివెరోతో కలిసి స్క్రీన్‌ప్లే రాశారు. జాన్ టి. డొమింగ్యూజ్ సినిమాటోగ్రఫీ అందించగా, అరాన్కాస్ కాల్లెజా సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలో ఇవాన్ మసాగుయ్, జోరియన్ ఎగ్విల్లర్, ఆంటోనియా శాన్ జువాన్, ఎమిలియో పువాలే, అలెగ్జాండ్రా మసాంగే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మొత్తం వర్టికల్ సెల్ఫ్-మేనేజ్‌మెంట్ సెంటర్ అనే జైలులో జరుగుతుంది. ఇందులో తీవ్రమైన నేరాలు చేసిన వారు ఉంటారు. నిలువుగా నిర్మితమౌప ఈ జైలులో 100 కంటే ఎక్కువ అంతస్తులు ఉంటాయి. రోజుకు ఒకసారి ఆహారం పంపుతారు. అయితే ప్రతి అంతస్తులో 2 నిమిషాలు మాత్రమే ఫుడ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది . దీంతో చాలా మంది ఖైదీలకు ఆహారం దొరకదు. ఇది జైలులో చెడు వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీని వలన ఖైదీలు తమలో తాము పోట్లాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆహారం దొరక్కపోవడంతో నరమాంసభక్షకులుగా మారి తోటి ఖైదీలపైనే దాడులకు పాల్పడుతారు. ఇదే క్రమంలో జైలులోకి వచ్చిన హీరో ఇవాన్ మసాగుయ్, బిడ్డ కోసం వెతుకుతున్న అలెగ్జాండ్రా మసాంజ్ జైలు నుంచి ఎలా తప్పించుకుంటారన్నదే ఈ సినిమా కథ.

ఈ సినిమా పేరు ది ప్లాట్‌ ఫామ్. ఈ మూవీని కేవలం ఆరు వారాల్లోనే చిత్రీకరించారు. సంపదను న్యాయంగా పంచుకోవాలనే తత్వశాస్త్రం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. బిల్‌బావోలోని ఒక ఓడరేవు వద్ద ఈ చిత్రం కోసం ఒక జైలు సెట్‌ను నిర్మించారు. మనుషుల్లోని దురాశ, ఆకలిని స్పష్టంగా చూపించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దర్శకుడు కాల్డర్ కాస్టెల్లు-ఉర్రుటియా మాట్లాడుతూ, ఈ చిత్రంలో చూపించిన దృశ్యాలు సమాజాన్ని ప్రతిబింబిస్తాయని అన్నారు. ఈ చిత్రం రెండవ భాగం 2024లో విడుదలైంది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ OTT ప్లాట్‌ఫామ్‌లో చూడటానికి అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ లేకపోయినా ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *