నిద్ర సరిగ్గా లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిద్రలేకపోతే ఏ పని మీద దృష్టి పెట్టలేరు. అందుకే బాగా నిద్రపోవాలని వైద్యులు సూచిస్తారు. తరచుగా ప్రజలు టీ లేదా కాఫీ నిద్ర లేకపోవడానికి అతిపెద్ద కారణమని నమ్ముతారు. కానీ వాస్తవం ఏమిటంటే మన డిన్నర్ ప్లేట్లో ఉండే కొన్ని ఇతర ఆహారాలు కూడా నిద్రకు భంగం కలిగిస్తాయి.
స్పైసీ ఫుడ్స్ : రాత్రిపూట కారంగా ఉండే ఆహారాలు తినడం జీర్ణక్రియపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది ఆమ్లత్వం, గుండెల్లో మంటను కలిగిస్తుంది. ఇది నిద్రకు భంగం వాటిల్లుతుంది. డిన్నర్లో వేయించిన పదార్థాలు, ఎక్కువ కారం ఉండే ఆహారాలు తినడం మానుకోవడం బెటర్.
తీపి – చక్కెర : రాత్రిపూట స్వీట్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. దీని కారణంగా శరీరానికి విశ్రాంతి లేకపోవడమే. శరీర శక్తిలోనూ మార్పులు వస్తాయి. ఈ హెచ్చుతగ్గులు సహజ నిద్ర చక్రాన్ని భంగపరుస్తాయి.
అధిక ప్రోటీన్ ఆహారాలు: చికెన్, రెడ్ మీట్ లేదా పెద్ద మొత్తంలో చీజ్ వంటి అధిక ప్రోటీన్ ఆహారాలు రాత్రి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. చురుకైన జీర్ణవ్యవస్థ కారణంగా శరీరం విశ్రాంతి తీసుకోదు. నిద్రపోవడానికి సమయం పడుతుంది.
మద్యం – కూల్ డ్రింక్స్
మద్యం నిద్ర వచ్చేలా చేస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ అది గాఢ నిద్ర చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. మరోవైపు కూల్ డ్రింక్స్‌లో ఉండే కెఫిన్, చక్కెర నిద్రకు అంతరాయం కలిగిస్తుంది.