వాస్తు, శాస్త్రాలలో చీపురును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. చీపురును అగౌరవపరిచే ఇంట్లో లక్ష్మీదేవి నిలువదని పురాణాలలో స్పష్టంగా చెప్పారు. చీపురు మార్చేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం వల్ల పేదరికాన్ని దూరం చేయడమే కాకుండా ఇంట్లో సానుకూల శక్తి, సంపద స్థిరత్వాన్ని కూడా కాపాడుకోవచ్చని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Trump Gold Tariff: షాకివ్వనున్న బంగారం ధరలు.. తులంపై రూ.10 వేలు పెరగనుందా?
చీపురు మార్చడానికి సరైన రోజు ఏది?
ఇవి కూడా చదవండి
మీరు చాలా రోజులుగా చీపురు వాడుతూ ఇప్పుడు దానిని మారుస్తుంటే దాని స్వంత కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యమంటున్నారు వాస్త నిపుణులు. శనివారం లేదా మంగళవారం చీపురు మార్చడం అశుభకరమని భావిస్తారు. గురువారం, శుక్రవారం చీపురు మార్చడం చాలా శుభప్రదం. ఎందుకంటే ఈ రోజులు దేవతల ఆశీర్వాదం పొందడానికి శుభప్రదంగా భావిస్తారు. సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత మాత్రమే చీపురును తీసుకెళ్లండి.
చీపురును గౌరవించండి:
పాత నమ్మకాల ప్రకారం.. ఇంట్లో చీపురు ఉండటం ఎంత ముఖ్యమో దానిని గౌరవించడం, ఎప్పటికప్పుడు దాన్ని మార్చడం కూడా అంతే ముఖ్యం. లక్ష్మీదేవి చీపురులో కూడా కోలువై ఉంటుందని మతపరమైన నమ్మకం ఉంది. అందుకే దానిపై కాలు వేయడం, తన్నడం లేదా అనవసరంగా విసిరేయడం దురదృష్టాన్ని ఆహ్వానిస్తుంది. మీరు చీపురును మార్చినప్పుడు పాత చీపురును శుభ్రం చేసి దానిని అవమానించకుండా ఇంటి నుండి దూరంగా, చెట్టు కింద లేదా దక్షిణ దిశలో ఉంచండి.
ఇది కూడా చదవండి: Viral Video: ఇవే తగ్గించుకుంటే మంచిది.. కొంపముంచిన మొండితనం.. ఇది కరెక్టేనా మీరు చెప్పండి
కొత్త చీపురు మీద కొంచెం ఉప్పు చల్లుకోండి :
మీరు కొత్త చీపురు కొన్నప్పుడల్లా మొదటిసారి ఉపయోగించే ముందు దానిపై కొంత రాతి ఉప్పు లేదా సాధారణ ఉప్పు చల్లుకోండి. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా ఇంటి మధ్యలో దానిని ఊడ్చడం ద్వారా ప్రారంభించండి. ఉప్పుకు శుభ్రపరిచే శక్తి ఉంది. అలాగే ప్రతికూల శక్తిని తొలగిస్తుందని నమ్ముతారు. ఈ చిన్న పరిహారం ఇంట్లో ఆనందం, శాంతి, సంపద స్థిరత్వాన్ని కాపాడుతుంది.
ఇది కూడా చదవండి: Zelo Electric: 100 కి.మీ రేంజ్.. కేవలం రూ.60 వేలకే.. మార్కెట్‌ను షేక్ చేసే ఈవీ
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి