Sleep Disorders: రాత్రుళ్లు నిద్రపట్టక నరకం చూస్తున్నారా..? ఈ చిట్కాలు పాటించి హాయిగా పడుకోండి!

Sleep Disorders: రాత్రుళ్లు నిద్రపట్టక నరకం చూస్తున్నారా..? ఈ చిట్కాలు పాటించి హాయిగా పడుకోండి!


Sleep Disorders: రాత్రుళ్లు నిద్రపట్టక నరకం చూస్తున్నారా..? ఈ చిట్కాలు పాటించి హాయిగా పడుకోండి!

నేటి బిజీ బిజీ జీవితంలో చాలామంది అధిక ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో తీవ్రమైన నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అర్దరాత్రి 12 దాటినా నిద్ర పట్టక అవస్థలు పడుతున్నవారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారిలో నిద్రలేమి కారణంగా అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. రాత్రంతా నిద్రలేకపోవడంతో ఉదయాన్నే ఏ పనిపైనా ఆసక్తి ఉండదు. రాత్రి సరైన నిద్రలేకపోవడంతో పగలు కునికిపాట్లు పడాల్సి వస్తుంది. దీంతో ఉద్యోగంలో సమస్యలు తప్పవు. ఇలా నిద్రలేమికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందులో ఎలక్ట్రానిక్‌ వస్తువులు ముఖ్య కారణంగా చెబుతున్నారు. ఇలా నిద్ర సమస్యలు ఎదుర్కొనేవారికి చక్కటి పరిష్కారం ఉంది. అదేంటో ఇక్కడ చూద్దాం..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కొన్ని ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలని అంటున్నారు. అందులో గ్రేప్స్‌ అతి ముఖ్యమైనవి. రోజూ రాత్రిపూట గ్రేప్‌ జ్యూస్, లేదంటే, పండ్ల రూపంలో తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే గ్రేప్స్‌లో నిద్రకు సహకరించే మెలటోనిన్ అనే హార్మోన్ పుష్కలంగా ఉంటుంది. కనుక పడుకోవడానికి అరగంట ముందు ద్రాక్షను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు అంటున్నారు నిపుణులు. ఫలితంగా ప్రశాంతమైన నిద్రకు దారితీస్తుంది.

అలాగే రాత్రిపూట గోరు వెచ్చని పాలు తాగితే కూడా చక్కటి నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పాలకూరను కూడా రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యకు పరిష్కారం లభిస్తుందని అంటున్నారు. చెర్రీ పండ్లకు కూడా మంచి నిద్రకు ఉపకరిస్తాయి. వీటితో పాటుగా ప్రతిరోజు రాత్రి ఏడు గంటలలోపు భోజనం చేయటం, నిద్రకు ముందు 10 నిమిషాల పాటు వాకింగ్‌ చేయటం వంటివి అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *