పసుపు తాడు కట్టిన భర్తకు ఉరితాడు దృశ్యం సినిమా చూసి మరీ.. పోలీసులే షాక్‌

పసుపు తాడు కట్టిన భర్తకు ఉరితాడు దృశ్యం సినిమా చూసి మరీ.. పోలీసులే షాక్‌


రోజూలాగే.. జులై 26న కంపెనీ వెళ్లిన విక్రమ్ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు జూలై 28న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. విక్రమ్ ఆచూకీ కనిపెట్టే క్రమంలో పోలీసులు విక్రమ్ భార్య సోనీని విచారించారు.ఈ క్రమంలో ఆమె.. విక్రమ్ స్నేహితుడు రవీందర్ ఏదో చేసి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేసింది. దీంతో, పోలీసులు రవీందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా..రవీందర్-సోనీకి వివాహేతర సంబంధం ఉన్న విషయం బయటపడింది. తమ బంధం గురించి భర్తకు తెలిసిపోయింది గనుక.. అతడిని చంపాలని సోనీ తనను కోరిందని, దీంతో ఆమెతో కలిసి తాను విక్రమ్‌ను చంపేశానని రవీందర్ పూసగుచ్చినట్లు బయటపెట్టేశాడు. విక్రమ్‌ను చంపే ముందు.. సోనీతో కలిసి తాను దృశ్యం సినిమాతో పాటు ఒక క్రైమ్ సీరియల్‌లోని అనేక ఎపిసోడ్‌లను చూసినట్లు కూడా రవీందర్ వెల్లడించాడు. జూలై 26న తన ముగ్గురు స్నేహితులైన ఫరియాద్, మనీష్, మరొకరితో కలిసి పథకం ప్రకారం.. విక్రమ్‌ను గొంతు కోసి చంపినట్లు రవీందర్ అంగీకరించాడు. గురుగ్రామ్‌లోని మొహమ్మద్‌పూర్ గ్రామంలోని ఈవిల్ సొసైటీ సమీపంలో ఒక గొయ్యిలో విక్రమ్ మృతదేహాన్ని పాతిపెట్టారు. విక్రమ్ హత్య జరిగినప్పటి నుంచి అతని మృతదేహాన్ని ఖననం చేసే వరకు సోని తన ప్రేమికుడితో నిరంతరం ఫోన్‌లో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరినీ అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Coolie: కూలీ నెం 1421.. రజనీ పట్టుకున్న ఈ బ్యాడ్జీ నంబర్‌ వెనుక

Coolie: కూలీ నెం 1421.. రజనీ పట్టుకున్న ఈ బ్యాడ్జీ నంబర్‌ వెనుక

ఊరంతా మొసళ్ల పండుగ ఎక్కడో తెలుసా..

ప్రైవేట్‌ ట్యాక్సీలకు పోటీగా త్వరలో భారత్ ట్యాక్సీలు

3 కోట్లు పెడితే.. 40 కోట్లు వసూల్.. ఆగస్టు 8న తెలుగులో రిలీజ్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *