Simharasi: ‘సింహరాశి’ మనల్ని ఏడిపించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..? ఇప్పుడు హీరో..?

Simharasi:  ‘సింహరాశి’ మనల్ని ఏడిపించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..? ఇప్పుడు హీరో..?


Simharasi:  ‘సింహరాశి’ మనల్ని ఏడిపించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..? ఇప్పుడు హీరో..?

కొన్ని సినిమాలు ఆడియెన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటాయి. ఏళ్లెన్ని గడిచినా, ఎన్ని సార్లు చూసినా వాటికి ఫ్యాన్ బేస్, వ్యూయర్‌షిప్ అస్సలు తగ్గదు. అలాంటి ఓ అపురూపమైన సినిమా ‘సింహరాశి’. డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన ఈ చిత్రం.. చూసిన ప్రతిసారీ మనసును తాకుంది. ఈ సినిమా వచ్చి దాదాపు 24 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా టీవీలో వస్తే చాలు చానెల్ మారకుండా చూస్తారు తెలుగు ప్రజలు. అంతటి రీపీట్ వాల్యూ ఉన్న సినిమా ఇది. ఇది కేవలం సినిమా కాదు.. భావోద్వేగాల రోలర్ కోస్టర్ రైడ్.

ఈ సినిమాని వి. సముద్ర డైరెక్ట్ చేశారు. ఇది ఆయన డైరెక్షన్‌లో వచ్చిన తొలి సినిమా. డెబ్యూలోనే ఎమోషనల్ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టేశాడు. నిజానికి ఇది తమిళ హిట్ చిత్రం ‘మాయి’కి రీమేక్. శరత్‌కుమార్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన ఆ తమిళ సినిమా అక్కడ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తెలుగులోకి అనువాదం చేసిన ‘సింహరాశి’ కూడా అదే స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఈ మూవీకి ఎస్‌.ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించారు. ఆడియో రిలీజైన రోజు నుంచే ఆల్బమ్‌ చార్ట్‌బస్టర్‌గా మారింది. ప్రతీ పాటకీ అద్భుతమైన మెస్మరైజింగ్ టచ్ ఉంది. అలాగే హీరోయిన్‌గా సాక్షి శివానంద్ ఆకట్టుకుంది. సినిమాలో ప్రతీ క్యారెక్టర్‌కు ఓ బలం ఉంది.

అయితే సినిమాలో హీరో రాజశేఖర్ చిన్నప్పటి పాత్రలో నటించిన చిన్న బాబు గుర్తున్నాడా.?. అప్పటికి బుడ్డోడి వయసు మూడో నాలుగు సంవత్సరాలు మాత్రమే. కానీ తన అమాయకపు నటనతో అందరితో కన్నీళ్లు పెట్టించాడు. ఇంత చిన్న వయసులో బుడ్డోడు అలా నటించడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పటికీ ఆ సీన్లు చూస్తే గుండె బరువెక్కిపోతుంది. అంతలా మనసుకు తాకే నటన ఆ చిన్నోడి సొంతం. ఆ చిన్నోడి పేరు మహేంద్రన్. ఆ బాబు ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు. తన లుక్స్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. అంతేనా సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నాడు.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా మహేంద్రన్ ఎన్నో చిత్రాల్లో నటించాడు. పెదరాయుడు, పెళ్లి చేసుకుందాం, ఆహా!, దేవి, అమ్మాయికి కోసం, నీ స్నేహం, సింహాద్రి లాంటి చిత్రాల్లో చిన్నపిల్లాడిగా కనిపించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న మహేంద్రన్, తెలుగులో హీరోగా కూడా ఫస్ట్ లవ్, అసలేం జరుగుతుందంటే వంటి చిత్రాల్లో కనిపించాడు. కానీ మళ్లీ విజయ్ సేతుపతి మూవీ మాస్టర్ సినిమా ద్వారా అసలైన క్రేజ్‌ను దక్కించుకున్నాడు. ప్రస్తుతం మహేంద్రన్ తమిళ చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకప్పుడు చిన్నారి పాత్రలో గుండెల్ని కదిలించిన అతను… ఇప్పుడు యంగ్ హీరోగా ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Master Mahendran 🔱 (@mahendranactorofficial)





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *