Beetroot: అందం, ఆరోగ్యం కోసం బీట్‌రూట్‌ ఎక్కువగా తీసుకుంటున్నారా..? ఈ సైడ్‌ఎఫెక్ట్స్‌ తప్పవు..!

Beetroot: అందం, ఆరోగ్యం కోసం బీట్‌రూట్‌ ఎక్కువగా తీసుకుంటున్నారా..? ఈ సైడ్‌ఎఫెక్ట్స్‌ తప్పవు..!


బీట్‌రూట్ జ్యూస్‌లో యాంటీఆక్సిడెంట్లు, నైట్రేట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయి. ఇది శక్తిని పెంచుతుంది. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. అయితే, బీట్‌రూట్‌ జ్యూస్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పోషకాలు సమృద్ధిగా ఉండటమే కాకుండా, ఇది కొన్ని దుష్ప్రభావాలను కూడా కలిగి ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల, ఏ సందర్భాలలో బీట్‌రూట్ రసం తీసుకోవడం సరైనది కాదో ఇక్కడ తెలుసుకుందాం..

బీట్‌రూట్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్‌ పెరుగతుంది. ఇది కిడ్నీల్లో రాళ్లను పెంచుతుంది. ఎక్కువ తీసుకోవడం వల్ల కడుపులో అజీర్తి చేస్తుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కొంతమందికి గొంతునొప్పి, దురద కూడా తీసుకువస్తుంది. కొంతమందికి గొంతునొప్పి, దురద కూడా తీసుకువస్తుంది. బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్లు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. అయితే, దీనిని ఎక్కువగా తాగడం వల్ల రక్తపోటు బాగా తగ్గుతుంది. ఇలాంటప్పుడు బీట్‌రూట్‌ ఎక్కువగా తింటే తలతిరుగుడు కూడా సంభవిస్తుంది. అంతేకాదు బీట్‌రూట్‌లో గ్లైసెమిక్ సూచీ కూడా ఎక్కువగా ఉంటుంది.

బీట్‌రూట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే బీట్‌రూట్ ఎక్కువగా తినడం వల్ల అపానవాయువు, గ్యాస్, మలబద్ధకం లేదా విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. కొంతమందికి బీట్‌రూట్‌కు అలెర్జీ ఉండవచ్చు. అలెర్జీ లక్షణాలలో చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాపుకు కారణం అవుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *