బ్లాక్ కాఫీ వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కెఫిన్ కాకుండా, బ్లాక్ కాఫీలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక అంశాలు ఉన్నాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, బ్లాక్ కాఫీ తాగడం వల్ల కాలేయ కొవ్వు తగ్గుతుంది. కాలేయ పనితీరు పెరుగుతుంది. ఒక అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ బ్లాక్ కాఫీ తాగడం వల్ల ప్రజల ఆయుష్షు పెరుగుతుందని తేలింది. మీరు దీర్ఘకాలం, ఆరోగ్యంగా జీవించాలనుకుంటే బ్లాక్ కాఫీ తీసుకోవడం ప్రారంభించవచ్చు అంటున్నారు నిపుణులు.
బ్లాక్ కాఫీ మీ ఆయుష్షును పెంచుతుందని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. చక్కెర, పాలు లేకుండా బ్లాక్ కాఫీ తాగడం వల్ల మరణ ప్రమాదాన్ని తగ్గించవచ్చని జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో వెల్లడించారు. ప్రతిరోజూ 1 నుండి 2 కప్పుల కెఫిన్ కలిగిన కాఫీ తాగేవారికి అన్ని కారణాల వల్ల, గుండె జబ్బుల వల్ల మరణించే ప్రమాదం తక్కువగా ఉంటుంది. దీని అర్థం బ్లాక్ కాఫీ మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, మీ ఆయుష్షును పెంచడంలో సహాయపడుతుంది.
బ్లాక్‌కాఫీలో న్యూరోట్రాన్సిమీటర్ ప్రేరేపించే గుణాలు ఉంటాయి. కాఫీ నాడీ వ్యవస్థను కూడా ఉత్తేజితం చేస్తుంది. ఇది ఎడ్రినాలైన్ విడుదల చేస్తుంది. దీంతో మీరు ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉంటారు. బ్లాక్ కాఫీలో క్యాలరీ కూడా తక్కువగా ఉంటాయి. ఇది మెటబాలిజం రేటును కూడా పెంచుతుంది. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. కాఫీలో లభించే యాంటీఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి. కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. ఈ అంశాలు గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. రోజుకు 1 నుండి 2 కప్పుల కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..