ఆకుపోయి ముల్లు మీద పడ్డా.. ముల్లు పోయి ఆకు మీద పడ్డా ఆకుకే బొక్క అనే సామెత ఈ సంఘటనకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. రోడ్డు మీద ట్రాఫిక్‌సెన్స్ లేని పోకిరీలు తాము ప్రమాదంలో పడటమే కాకుండా ఇతరుల ప్రాణాలతో చెలగాటం అడుతుంటారు. అందుకే మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతు.. ఎదుటి వాడు కూడా అంతే జాగ్రత్తగా ఉన్నప్పుడే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. జమ్ము కాశ్మీర్లో జరగిని ఓ రోడ్డు ప్రమాద సంఘటన ఇప్పుడు నెట్టింట్లో వరైరల్ అవుతోంది.
రాంగ్ రూట్లో వచ్చి థార్ వాహనం స్కూటర్‌పై ఎదురుగా వస్తున్న ఒక వృద్ధుడిని ఢీకొట్టినట్లు ఫుటేజ్ చూపిస్తుంది. సహాయం చేయడానికి బదులుగా, డ్రైవర్ రివర్స్ చేసి మళ్ళీ ఢీకొట్టాడు. ఈ సంఘటన వెనుక వ్యక్తిగత కారణాల గురించి ఊహాగానాలు తలెత్తాయి. కానీ, అలాంటిది ఏమీ లేనట్లు తెలిసింది. ఈ సంఘటనను చూస్తున్న చుట్టూ ప్రజలు నిలబడి ఉన్నారు. కానీ ఎవరూ వృద్ధుడికి సహాయం చేయలేదని వీడియో చూపించింది. ఈ సంఘటన పట్ల సోషల్ మీడియాలో తీవ్రంగా తూర్పారబడుతున్నారు.
వీడియో చూడండి:
Road rage kalesh, Jammu city
Pehele Thar wala wrong way se aya jis se ye uncle gir gaye phir reverse gear mai laya aur uncle ko piche se thoka befaltu mai.pic.twitter.com/NebTAkhlWz— Deadly Kalesh (@Deadlykalesh) July 28, 2025
ఈ వీడియో వైరల్ కావడంతో చాలా మంది డ్రైవర్‌ను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎక్కువ మంది ఇతరులకు ఎందుకు సహాయం చేయకూడదని కూడా అడుగుతున్నారు. ఈ సంఘటన సమాజంలో మానవత్వం లోపించడం అనే పెద్ద సమస్యను చూపిస్తుందని కామెంట్స్ పెడుతున్నారు. ఇది అక్షరాలా హత్యాయత్నం అంటూ పోస్టులు పెడుతున్నారు.
మొదట థార్ వాహనం వ్యక్తి రాంగ్ రూట్లో వచ్చాడు. దాంతో స్కూటర్‌పై వెళుతున్న పెద్దాయన పడిపోయాడు. అప్పుడు థార్ డ్రైవర్ నిర్లక్ష్యంగా కారును రివర్స్ చేసి వెనుక నుండి కూడా ఎటువంటి కారణం లేకుండా అతనిని ఢీకొట్టాడు. ఆ థార్ డ్రైవర్‌ను నేరుగా జైలుకు పంపించాలని నిటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.