Viral: పాము కక్కిన గుడ్లను తీసుకొచ్చి పొదిగించారు.. ఏం పిల్లలు పుట్టాయో తెల్సా..?

Viral: పాము కక్కిన గుడ్లను తీసుకొచ్చి పొదిగించారు.. ఏం పిల్లలు పుట్టాయో తెల్సా..?


అతి తమిళనాదడు తిరునెల్వేలి జిల్లా అంబాసముద్రం ప్రాంతం. తేదీ జూలై 27.. స్థానికంగా నివాసం ఉండే విజయలక్ష్మి అనే మహిళ ఇంట్లో నాగుపాము ప్రవేశించినట్టు సమాచారం వచ్చింది. అలర్ట్ అయిన అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పామును చాకచక్యంగా రెస్క్యూ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. అది ఏవో 7 గుడ్లను కక్కేసింది. అవి వేటి గుడ్లో ఎవరికీ అర్థం కాలేదు.

పగలకపోవడంతో ఆ గుడ్లను స్థానిక పశువైద్య శాఖ అధికారి డాక్టర్ మనోహరన్‌కి అప్పగించారు. ఆయన వాటిని పరిశీలించి షాక్ అయ్యారు. అవి కోడి గుడ్లు కావని!.. కౌజు పిట్ట గుడ్లు అని తేల్చారు. బహుశా ఆ పాము పక్షి గూడుపై అటాక్ చేసి వాటిని.. రెస్క్యూ సమయానికి కొద్దిసేపటి ముందే ఆరగించి ఉండొచ్చని.. ఆయన తెలిపారు. ఆ గుడ్లలో జీవం ఉందేమోనన్న అనుమానంతో.. ఇంక్యుబేటర్‌లో పెట్టి పొదిగించడం మొదలుపెట్టారు.

వారం రోజుల తర్వాత.. నమ్మలేని ఘటనే జరిగింది. వాటిలో నాలుగు గుడ్ల నుంచి పిట్ట పిల్లలు బయటపడ్డాయి. పాము కడుపులోంచి బయటపడి… ఇంక్యుబేటర్‌లో జీవం పోసుకున్న ఆ పిల్లలను అందరూ ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. “ఈ ఘటన నన్ను షాక్‌కి గురి చేసింది. ఇదొక ప్రకృతి అద్భుతం. ఇప్పటివరకు ఎప్పుడూ చూడనిది.” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

Baby Birds

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *