తల్లి బరితెగింపుతో విసిగి కొడుకు సూసైడ్‌.. ఇంటికి నిప్పు పెట్టిన ఊరి జనం!

తల్లి బరితెగింపుతో విసిగి కొడుకు సూసైడ్‌.. ఇంటికి నిప్పు పెట్టిన ఊరి జనం!


మంచిర్యాల, ఆగస్టు 8: నేటి కాలంలో తినే తిండి నుంచి భవబంధాల వరకు అంతా కల్తీమయమైపోతుంది. అయితే ప్రపంచమే తల్లకిందులైన మారనిది తల్లి ప్రేమ. తల్లి పాలలాగే ఆమె ప్రేమ కూడా ఎంతో స్వచ్ఛమైంది. ప్రస్తుత రోజుల్లో తల్లి ప్రేమానురాగాలు కూడా విషతుల్యమైపోతున్నాయి. సంసారం, బిడ్డల కోసం సర్వం అర్పించే నారీ మణులు.. రూటు మార్చారు. ఎవరేమైపోతే నాకెందుకు? నాకు నచ్చినట్లు ఉంటా? అనే స్థితికి దిగజారారు. ఏమాత్రం నైతిక విలువలు లేకుండా బతుకు బుగ్గిపాలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ తల్లి బరితెగింపు చూడలేక ఆమె నవమాసాలు మోసి కన్న సొంత కొడుకే అసహ్యించుకున్నాడు. అలాంటి తల్లి కడుపున పుట్టినందుకు నిలువెల్లా దహించిపోయాడు. అంతే తల్లి ఇంట్లోనే పురుగుల మందు సేవించి ప్రాణాలొదిలాడు. ఈ విషాథ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గంగారంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గంగారం గ్రామానికి చెందిన దుర్కి అనిల్‌ (22) స్థానికంగా సెంట్రింగ్‌ మేస్త్రీ పనులు చేస్తుంటాడు. పెళ్లీడుకొచ్చిన కొడుకు ఉన్న అతడి తల్లి మాత్రం ఆవుడం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ మంగళి తిరుపతితో గత కొంతకాలంగా చనువుగా ఉండసాగింది. తల్లి సంగతి తెలిసిన అనిల్‌.. తీరు మార్చుకోవాలని తల్లికి సూచించాడు. దీనిపై మంగళవారం (ఆగస్టు 5) తల్లీకొడుకుల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. దీంతో విసుగు చెందిన అనిలో ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు హుటాహుటీన మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటున్న క్రమంలో తన మరణానికి తల్లి, మంగళి తిరుపతే కారణమని వీడియో కూడా రూపొందించాడు. అయితే పరిస్థితి విషమించి బుధవారం రాత్రి అనిల్‌ ప్రాణాలు వదిలాడు. ఈ విషయం తెలుసుకున్న ఆటో డ్రైవర్‌ తిరుపతి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు.

దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు, అనిల్‌ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ప్రసాద్‌ కేసునమోదు చేసుకుని పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహం తీసుకుని నేరుగా అనిల్‌ ఇంటికి వెళ్లి.. తిరుపతి ఇంటికి నిప్పుపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు వ్యాపించకుండా అదుపుచేశారు. అక్కడ అనిల్‌ స్నేహితులు, బంధువులు, గ్రామస్థులు పోలీసులతో తీవ్ర వాగ్వాధానికి దిగారు. అనంతరం బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌ 25 మంది బెటాలియన్‌ పోలీసులను తీసుకువచ్చి పరిస్థితి అదుపుచేశారు. గ్రామ పెద్దలతో చర్చించి, న్యాయం చేస్తామని ఏసీపీ హామీ ఇవ్వడంతో అనిల్‌ మృతదేహాన్ని అక్కడి నుంచి గ్రామానికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *