గ్రహ దోషాలతో ఇబ్బంది పడుతున్నారా.. ఆవుకి ఆహారం పెడితే గ్రహాలు శాంతిస్తాయి..ఏ దోషానికి ఏ ఆహారం అందించాలంటే

గ్రహ దోషాలతో ఇబ్బంది పడుతున్నారా.. ఆవుకి ఆహారం పెడితే గ్రహాలు శాంతిస్తాయి..ఏ దోషానికి ఏ ఆహారం అందించాలంటే


ఎవరి జాతకంలో గ్రహ దోషాలు పదే పదే కనిపిస్తుంటే, శుభకార్యాలు ఆగిపోతూ ఉంటే లేదా జీవితంలో అకస్మాత్తుగా ఇబ్బందులు , కష్టాలు ఎదురైతే దానికి కారణం జాతకంలో తొమ్మిది గ్రహాల ప్రభావం వలన కావచ్చు. జాతకంలో గ్రహ దోషాల నివారణకు ఆవుకు కొన్ని రకాల ఆహారాన్ని అందించడం ద్వారా ఈ గ్రహాలను శాంతింపజేయవచ్చని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. ఎవరైనా దోష నివారణలతో విసిగిపోయి ఉంటే.. ఈ సరళమైన క నివారణను స్వీకరించవచ్చు. ఈ పరిహారాలు చేయడం వలన గోమాత ఆశీర్వాదం లభించడమే కాదు.. నవ గ్రహాల దోషాలు తొలగి.. వాటి ఆశీర్వాదాలు లభిస్తాయి. జీవితం పురోగతిలో సాగుతుందని వెల్లడించింది. ఈ శాస్త్ర ఆధారిత నివారణలు సనాతన ధర్మం, జ్యోతిషశాస్త్రానికి సంబంధించినవి. సనాతన ధర్మంలో గోసేవ ఒక ధర్మం మాత్రమే కాదు.. గ్రహాల దుష్ప్రభావాలను నుంచి బయట పడేలా చేసే ప్రభావవంతమైన మార్గం కూడా.

సూర్యుడు దోషం ఉంటే..
నవ గ్రహలకు సూర్యుడు అధినేత. సూర్యుడు ఆత్మవిశ్వాసం, పరిపాలనకు ప్రతీక. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే ఆవుకు బెల్లం తినిపించండి. అది సూర్యుడికి తీపిని , ప్రకాశాన్ని అందిస్తుంది.

చంద్రుడు బలహీనంగా ఉంటే?
చంద్రుడు మనస్సు, భావోద్వేగాలకు అధిపతి. చంద్ర దోష నివారణ కోసం.. చంద్రుడిని శాంతపరచడానికి.. ఆవుకు అన్నం తినిపించండి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. శాంతిని ఇస్తుంది. పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయడం ఫలవంతం.

ఇవి కూడా చదవండి

కుజ దోషం ఉంటే
కుజుడు దూకుడు, శక్తికి కారకుడు. కుజుడిని శాంతపరచడానికి పప్పు, రోటీ, బెల్లం మిశ్రమాన్ని ఆవుకు తినిపించండి. ఇది ఆరోగ్య, కోపానికి సంబంధించిన దోషాలను సమతుల్యం చేస్తుంది.

బుధుడు ప్రభావితమైతే
బుధుడు తెలివితేటలకు, వాక్కుకు , వ్యాపారానికి అధిపతి. దీని కోసం ఆవుకు పచ్చి గడ్డి లేదా పచ్చి పాలకూర తినిపించండి. ఇది కమ్యూనికేషన్, జ్ఞాపకశక్తి , నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

గురు దోష నివారణకు
గురువు జ్ఞానం, మతానికి ప్రతినిధి. దీని కోసం ఆవుకు పప్పు , నెయ్యి వేసిన గోధుమ రోటీని తినిపించండి . ఇది ఆధ్యాత్మిక పురోగతిని, పిల్లలకు ఆనందాన్ని ఇస్తుంది.

శని అశుభ ఫలితాలను ఇస్తుంటే?
శని కర్మ , న్యాయానికి ప్రతీక. దీని దుష్ప్రభావాల వల్ల జీవితం కష్టాలమవుతుంది. అటువంటి పరిస్థితిలో ఆవుకు నువ్వుల నూనెతో చేసిన గోధుమ రోటీని తినిపించండి. ఈ పరిహారం ముఖ్యంగా ఉద్యోగం, ఆరోగ్యానికి సంబంధించిన అడ్డంకులు, బాధలను తగ్గిస్తుంది.

రాహు-కేతు దోషం ఉంటే..
రాహువు, కేతువు ఛాయా గ్రహాలు. ఇవి భ్రమ, భయం, మంత్రవిద్య, మానసిక గందరగోళానికి కారణమవుతాయి. రాహు దోషం ఉంటే ఆవుకు తెల్ల నువ్వులు, రొట్టె తినిపించండి. కేతు దోషం ఉంటే ఉడికించిన పెసలు, పెసర పప్పు ఆహారంగా అందించండి. ఈ పరిహారాలు ఛాయా గ్రహాల ప్రతికూలత నుంచి రక్షిస్తాయి.

ఆవుకు ఆహారాన్ని ప్రేమగా, నిర్మల హృదయంతో అందించండి. అయితే ఆవుకి పాడైపోయిన ఆహరాన్ని , బ్రెడ్ వంటి ఆహారాన్ని అందించవద్దు. ఆవుకి అందించే ఆహారం సాత్వికంగా ఉండాలి. ఈ నివారణను వారానికి 1 లేదా 2 సార్లు క్రమం తప్పకుండా చేయండి. ప్రతిరోజూ ఆవును సేవించాలి. వీలు లేనివారికి సోమవారం, గురువారం, శనివారం ఉత్తమమైనవి రోజులుగా భావిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *