తండ్రి స్కూల్ ముందు సమోసాలు అమ్మేవాడు.. కూతురు ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ సింగర్.

తండ్రి స్కూల్ ముందు సమోసాలు అమ్మేవాడు.. కూతురు ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ సింగర్.


తండ్రి స్కూల్ ముందు సమోసాలు అమ్మేవాడు.. కూతురు ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ సింగర్.

పై ఫొటోలో కనిపిస్తున్న నటి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సింగర్. ఎన్నో క్లాసిక్ హిందీ పాటలను రీమేక్ చేయడంలో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే అనేక సూపర్ హిట్స్ అద్భుతంగా ఆలపించి శ్రోతల హృదయాలను మైమరపించింది. ఇప్పుడు బుల్లితెరపై పలు సింగింగ్ రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది. హిందీ సినీ పరిశ్రమలో గాయనిగా కొనసాగుతున్నబ్యూటీ.. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అలాగే పలు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసింది. కానీ సింగర్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమెకు సంబంధించిన పర్సనల్ విషయాలు నెట్టింట వైరలవుతుంటాయి. అలాగే చాలాసార్లు ఆమె సింగింగ్ పై విమర్శలు వచ్చాయి. కానీ అవేం పట్టించుకోకుండా లైఫ్ గడిపేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

ఆమె ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ సింగర్ నేహా కక్కర్. నేహా కక్కర్ జూన్ 6, 1988న ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో జన్మించింది. తండ్రి రిషికేశ్ కక్కర్. తల్లి నీతి కక్కర్. సోదరుడు టోనీ కక్కర్ సంగీత దర్శకుడు. సోదరి సోను కక్కర్ సింగర్. ఉత్తరాఖండ్ ప్రాంతానికి చెందిన నేహా కక్కర్.. ఆ తర్వాత కుటుంబంతో కలిసి ఢిల్లీకి మకాం మార్చింది. చిన్న వయసులోనే పాటలు పాడడం ప్రారంభించింది నేహా కక్కర్. చిన్నప్పటి నుంచే అనేక కచేరీలలో పాటలు పడింది. ఆమె సోదరి సోను కక్కర్‌తో కలిసి ఆలయాల్లో భజనలు, కీర్తనలు పాడింది.

ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

చిన్నవయసులోనే నేహా కక్కర్ కుటుంబం ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంది. ఆమె తండ్రి రిషికేశ్‏లో తన సోదరి చదివిన పాఠశాల ముందు సమోసాలు అమ్మేవాడని గతంలో నేహా కక్కర్ చెప్పుకొచ్చింది. నేహా కక్కర్ 2005 సంవత్సరంలో ‘ఇండియన్ ఐడల్’ సీజన్ 2 షోతో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత, ఆమె అనేక బాలీవుడ్ పాటలు పాడింది. ప్రస్తుతం బీటౌన్ ఇండస్ట్రీలో టాప్ సింగర్ గా స్థానం సంపాదించుకుంది. నేహా కక్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *