సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది సినిమాల్లో అవకాశాలు కూడా అందుకుంటున్నారు. ఇక సినిమాల్లో హీరోయిన్స్ కు ఎంత క్రేజ్ ఉంటుందో సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్ల కు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. సినిమా హీరోయిన్స్ కంటే ఇన్ఫులెన్సర్ల హడావిడే ఎక్కువగా కనిపిస్తుంది. టాలీవుడ్ లోనే కాదు , బాలీవుడ్ లోనూ చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్లు సందడి చేస్తున్నారు. చాలా మంది ముద్దుగుమ్మలు తమ గ్లామర్ తో నెటిజన్స్ ను విపరీతముగా ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో రీల్స్ తో పాటు పలు యాడ్ ప్రమోషన్స్ లోనూ దుమ్మురేపుతోంది. ఇక ఈ చిన్నదాన్ని సోషల్ మీడియాలో ఫాలో అయ్యవారు చాలా మందే ఉన్నారు.
ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి
అయితే ఈ మధ్య చాలా మంది ముద్దుగుమ్మలు సోషల్ మీడియా ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. వీడియో కాల్ లో మాట్లాడాలంటే డబ్బులు కూడా వసూల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే బ్యూటీ కూడా తన ప్రీమియం సేవల రేట్లు తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరంటే.. ఈ చిన్నదాని పేరు అంకిత సింగ్. ఈ ముద్దుగుమ్మ నార్త్ లో చాలా ఫెమస్. సోషల్ మీడియాలో అంకితా సింగ్ కు 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ స్టాలో గ్లామరస్ ఫొటోలతో గత్తర లేపుతుంది ఈ భామ. సినిమాలు, వెబ్ సిరీస్ లు చేయలేదు కానీ మ్యూజిక్ వీడియోల్లో మెరిసింది ఈ భామ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అంకిత సింగ్ మాట్లాడుతూ.. తన అభిమాని ఓ యాప్ ద్వారా తనకు వీడియో కాల్ చేసి తిట్టామని చెప్పాడని.. అందుకుగాను రూ. 35000 పంపించాడు అని తెలిపింది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి
అలాగే అంకిత సింగ్ ప్రీమియం సేవల రేట్ల గురించి మాట్లాడుతూ.. ఒక యాప్ ద్వారా తనతో 5-10 నిమిషాలు చాటింగ్ చేయాలంటే, రూ.15,000 నుంచి రూ.20,000 వరకు డబ్బులు పే చేయాలి. అదే విధంగా వీడియో కాల్ చేసి మాట్లాడాలంటే రూ.30,000 కంటే ఎక్కువ పే చేయాలి. ఇక రూ.3 లక్షలు ఇస్తే నెంబర్ కూడా ఇస్తుందట ఈ ముద్దుగుమ్మ. అంకిత సింగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్స్ ఈ అమ్మడి కామెంట్స్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.