ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరం మొత్తం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగి, రోడ్లు… నదులను తలపిస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓ కుటుంబానికి ఊహించని కష్టం ఎదురైంది. వారి పసిబిడ్డ తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లక తప్పని పరిస్థితి. కానీ బయట ఎటుచూసినా నడుం లోతుకు పైగా వరద నీరు చేరడంతో వాహనాలు తిరిగే మార్గం లేదు. ఆ సమయంలో ఆ తండ్రి ఏమాత్రం ఆలోచించలేదు. తన బిడ్డను గుండెలకు హత్తుకుని, వరద నీటిలోనే ఆస్పత్రికి నడక ప్రారంభించాడు. భర్తకు తోడుగా భార్య కూడా ఆ నీటిలోనే నడుస్తూ అనుసరించింది. బిడ్డ కోసం ఆ తల్లిదండ్రులు పడిన ఆరాటం అక్కడున్న వారిని కదిలించింది.
మరిన్ని వీడియోల కోసం :