అలాంటి సీన్ చేసి ఇంటికెళ్లి ఏడ్చా.. ఇప్పటికీ బాధగానే ఉంది.. ఇన్నాళ్లకు అసలు విషయం బయట పెట్టిన సదా

అలాంటి సీన్ చేసి ఇంటికెళ్లి ఏడ్చా.. ఇప్పటికీ బాధగానే ఉంది.. ఇన్నాళ్లకు అసలు విషయం బయట పెట్టిన సదా


దర్శకుడు తేజ సినిమాలతో చాలా మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలా వచ్చిన వారిలో సదా ఒకరు. తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. నితిన్ హీరోగా నటించిన జయం సినిమాలో హీరోయిన్ గా సదా నటించాగా విలన్ గా గోపీచంద్ నటించాడు. ఇక ఈ సినిమాలో నటించిన అందరికి క్రేజ్ వచ్చింది. ఆతర్వాత నితిన్, సదా, గోపిచంద్ వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. సదా టాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించింది. స్టార్ హీరోలతో కూడా ఈ అమ్మడు జతకట్టింది. అలాగే తమిళ్ లోనూ సినిమాలు చేసింది. శంకర్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ నటించిన అపరిచితుడు సినిమాలో నటించింది. తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే ఆతర్వాత సదాకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. తెలుగు లోనే కాదు తమిళ్ లోనూ మెల్లగా ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి.

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

ఇదిలా ఉంటే సదా జయం సినిమా గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. జయం సినిమాలో ఓ సన్నివేశంలో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డానని ఇంటికెళ్లి మరీ ఏడ్చాను.. ఇప్పటికి కూడా ఆ సీన్ ఎందుకు చేశానా అని చాలా బాధపడ్తాను అని తెలిపింది. జయం సినిమాలో విలన్ గోపీచంద్ కూడా సదాను ప్రేమిస్తాడు. అయితే సదా ప్రేమించిన నితిన్ ముందు ఆమె బుగ్గపై నాలుకతో నాకుతాడు. ఈ సన్నివేశం చేసేటప్పుడు చాలా ఇబ్బందిపడ్డాను అని సదా తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

నేను ఆ సన్నివేశంలో నటించాను అని దర్శకుడికి ముందే చెప్పినా కూడా ఆయన వినిపించుకోలేదట. ఆ సీన్ సినిమాకు హైలైట్ అవుతుందని చెప్పి తనతో చేయించారట. ఆతర్వాత ఇంటికెళ్లి పదేపదే మొహాన్ని కడుక్కున్నా అని తెలిపింది సదా. కానీ జయం సినిమాతో తనకు ఎంతో పేరు వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం సదా పలు టీవీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది. త్వరలోనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది.

ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *