తాజాగా, అలా గుడ్లనుంచి ప్రాణం పోసుకుని బయటకు వచ్చిన ఓ నాగుపాము కూన బయటి ప్రపంచంలోకి విహారానికి వచ్చింది. అయితే, ఆ పామును చూసిన రెండు కోళ్లు పెద్దగా అరుస్తూ దానిమీద దాడిచేశాయి. అయితే.. చిన్న కూన అయినా.. నాగుబాము ఏమాత్రం తగ్గలేదు. తనను తాను రక్షించుకోడానికి తన బుల్లి పడగ విప్పి కోళ్లపై ఎదురుదాడి చేసింది. దీంతో కోళ్లు కాస్త వెనక్కి తగ్గటంతో.. పాము పిల్ల మళ్లీ తన దారిన తాను పోయింది. అయితే, మళ్లీ కోళ్లు దాని వెంట పడి ముక్కులతో పొడుస్తూ పాముపై దాడి చేశాయి. కోళ్ల బారి నుంచి తప్పించుకోవడానికి పాము తన వంతు ప్రయత్నం చేసినా ఫెయిల్ అయినట్లే అర్థమవుతుంది. వీడియో ఎండింగ్ పూర్తిగా లేనప్పటికీ.. ఆ పామును కోళ్లు తినేసి ఉంటాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.
మరిన్ని వీడియోల కోసం :