ఛైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రాశి. మమతల కోవెల, రావు గారి ఇల్లు, పల్నాటి పౌరుషం, బాలగోపాలుడు, ఆదిత్య 369 లాంటి సూపర్ హిట్ సినిమాల్లో బాల నటిగా యాక్ట్ చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ సినిమాల్లోనూ ఛైల్డ్ ఆర్టిస్టుగా యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చింది. 1997లో పెళ్లి పందిరి సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన రాశి పలు సూపర్ హిట్ సినిమాల్లో కథానాయికగా నటించింది. గోకులంలో సీత, శుభాకాంక్షలు, మనసిచ్చి చూడు, ప్రేయసి రావే, సముద్రం, కృష్ణబాబు, మూడు ముక్కలాట, ఆమ్మో ఒకటో తారీఖు, దేవుళ్లు, సందడే సందడి తదితర సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో నెగెటివ్ రోల్ లోనూ అదరగొట్టిందీ అందాల తార.
డైరెక్టర్ తో ప్రేమ, పెళ్లి.. సినిమాలకు దూరం..
కాగా 2005లో డైరెక్టర్ శ్రీమునిని ప్రేమించి పెళ్లి చేసుకుంది రాశి. వివాహ తర్వాత సినిమాలు బాగా తగ్గించేసిందీ ముద్దుగుమ్మ. అయితే చాలామంది లాగే మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసింది. ఇప్పుడు సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ యాక్ట్ చేస్తోందీ అందాల తార. గిరిజ కళ్యాణం, జానకి కనగనలేదు సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది రాశి. లేటెస్ట్ గా ఆమె నటించిన చిత్రం ఉసురే. ఇటీవలే రిలీజైన ఈ సినిమాలో రాశి హీరోయిన్ తల్లి పాత్రలో నటించింది. సినిమా ప్రమోషన్లలో బాగా ఉసురే సినిమాను రాశి తన కుమార్తె, ఇతర చిత్ర యూనిట్ తో కలిసి ప్రత్యేకంగా వీక్షించింది ఈ సందర్భంగా రాశి తన కుమార్తెని తొలిసారి కెమెరా ముందు మీడియాకి, ప్రేక్షకులకు పరిచయం చేసింది. ప్రస్తుతం రాశి కూతురుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
కూతురు కోసమే సినిమాలకు దూరమయ్యాను.. ఇకపై రెగ్యులర్ గా..
ఈ సందర్భంగా రాశి మాట్లాడుతూ భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు వచ్చినా చేస్తానని.. కాకపోతే కథలో తన పాత్ర కీలకం కావాలని కోరారు. ‘ఇన్నాళ్లు కుటుంబం కోసమే సినిమాలకు గ్యాప్ తీసుకున్నా. ఇప్పుడు నా కూతురు తన పనులు తాను చేసుకోగలుగుతోంది. కాబట్టి ఇకపై నేను సినిమాలపై ఫోకస్ చేస్తాను’ అని చెప్పుకొచ్చింది.

Actress Raasi Daughter
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.