‘వాడో పిచ్చోడు మావ..’ డీఎస్పీ సిరాజ్‌పై పాక్ బౌలర్ పిచ్చి కూతలు.. తొక్కి నారతీస్తామంటున్న ఫ్యాన్స్

‘వాడో పిచ్చోడు మావ..’ డీఎస్పీ సిరాజ్‌పై పాక్ బౌలర్ పిచ్చి కూతలు.. తొక్కి నారతీస్తామంటున్న ఫ్యాన్స్


ఒకప్పుడు సచిన్, సెహ్వాగ్ లాంటి దిగ్గజాల వికెట్లు తీసి ప్రశంసలు అందుకున్న పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్.. ఇప్పుడు టీమిండియాపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. అతడు మరెవరో కాదు షబ్బీర్ అహ్మద్ ఖాన్. ముఖ్యంగా టీమిండియా ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ బాల్‌ ట్యాంపరింగ్ చేశారని.. అందుకే టీమిండియా ఓవల్ టెస్ట్ గెలిచిందంటూ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తాడు. దీంతో అతడికి టీమిండియా అభిమానులు సైతం అదే రీతిలో గట్టిగా జవాబిచ్చారు.

బంతి షైన్ అవ్వడానికి సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ వాసెలిన్‌ను ఉపయోగించారని షబ్బీర్ అహ్మద్ ఖాన్ ట్వీట్ చేశారు. ఓవల్ టెస్ట్‌లో బంతి చాలా మెరుస్తూ కనిపించింది. అందుకే టీమిండియా గెలిచింది. ఓవల్ టెస్ట్‌లోని ఆ బంతిని టెస్టుల కోసం ల్యాబ్‌కు పంపించాలని అతడు అన్నాడు. దీంతో ఒక్కసారిగా షబ్బీర్ ఖాన్‌కు టీమిండియా ఫ్యాన్స్‌ నుంచి ధీటైన కౌంటర్ వచ్చింది. మెంటలోడిలా ఉన్నాడు. మానసిక పరీక్షల కోసం పిచ్చాసుపత్రికి పంపించండి అని మనోళ్లు ఏకీపారేశాడు.

షబీర్ కెరీర్ ముగిసింది ఇలా..

పాకిస్తాన్ తరఫున టెస్ట్ క్రికెట్‌లో షబ్బీర్ అహ్మద్ ఖాన్ అద్భుతంగా రాణించాడు. అతను 10 టెస్ట్‌ల్లో 51 వికెట్లు పడగొట్టాడు. అంత మంచి ప్రదర్శన ఇచ్చినప్పటికీ అతడి కెరీర్ 2005లో ముగిసింది. ఎందుకంటే అతడి యాక్షన్ అనుమానాస్పదంగా ఉందని తేలడంతో.. షబ్బీర్‌పై పాక్ బోర్డు బ్యాన్ విధించింది. దీని తర్వాత, షబ్బీర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రాలేకపోయాడు. షబ్బీర్ అహ్మద్ ఖాన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు అతడి మోచేయి 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంగి ఉండేది. ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధం.

సచిన్, సెహ్వాగ్‌లను ఔట్ చేశాడు..

టీమిండియాపై 6 వన్డేల్లో షబ్బీర్ అహ్మద్ 8 వికెట్లు పడగొట్టాడు. ఈ ఆటగాడు 2004 మార్చి 19న పెషావర్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్‌పై మూడు వికెట్లు పడగొట్టాడు. అందులో రెండు వికెట్లు సచిన్, సెహ్వాగ్ లవే. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.

ఇది చదవండి: ఎవర్రా సచిన్.! 140 సెంచరీలు, 36 వేలకుపైగా పరుగులు.. ఈ తోపు బ్యాటర్ బరిలోకి దిగితే బౌలర్లకు వణుకే.. 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *