ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప, పుష్ప 2 సినిమాలు రెండు భారీ హిట్ అయ్యాయి. దాంతో ఇప్పుడు అల్లు అర్జున్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. అల్లు అర్జున్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నాడు. సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. బన్నీకి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. ఇండియా మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా కేరళలో అల్లు అర్జున్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఓ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న విషయం మీకు తెలుసా.?
ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి
అల్లు అర్జున్ మిస్ చేసుకున్న సినిమాతో ఓ యంగ్ హీరో భారీ హిట్ అందుకున్నాడు. ఇంతకూ ఆ సినిమా ఎదో.. ఆ యంగ్ హీరో ఎవరో తెలుసా.? అవును ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ భారీ హిట్ సినిమాను మిస్ చేసుకున్నారు. ఆ సినిమా ఎదో కాదు తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన జయం. అవును జయం సినిమాను ముందుగా అల్లు అర్జున్ చేయాల్సింది. కానీ ఆ సినిమా మిస్ అయ్యింది.
ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి
నిజానికి జయం సినిమాతో అల్లు అర్జున్ ఇండస్ట్రీకి పరిచయం అవ్వాల్సి ఉందట.. కానీ అది జరగలేదు. ఆతర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. గంగోత్రి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్. స్టైలిష్ స్టార్ గా.. ఆతర్వాత ఐకాన్ స్టార్ గా, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇక అల్లు అర్జున్ మిస్ చేసుకున్న జయం సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.