సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఎప్పటికి గుర్తుండి పోతాయి. చిన్న సినిమాలుగా వచ్చి సంచలనాలు క్రియేట్ చేసినవి చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.యువతీయువకులను కట్టిపడేసిన సినిమాల విషయానికొస్తే కోకొల్లలుగా ఉన్నాయి. ఆ లిస్ట్‌లో బోలెడన్ని సినిమాలు ఉన్నాయి. వాటిలో సైరాట్ సినిమా ఒకటి. ఇది మరాఠి సినిమా అయినప్పటికీ బాషాతో సంబంధం లేకుండా ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఒక ఊపు ఊపేస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి
తొలి చిత్రంతోనే కోట్లాది మంది అభిమాను హృదయాలను గెలుచుకుంది హీరోయిన్ రింకు రాజ్ గురు. ఈ పేరు చెబితే మీకు అంతగా గుర్తుపట్టలేరు కావచ్చు. కానీ.. సైరత్ మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఇండస్ట్రీలోనే ఫేమస్ అయ్యింది రింకు. ఈ చిత్రంలో అర్చీ పాత్రలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది రింకు రాజ్ గురు. ఇందులో ఆమె యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు.
ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి
అందులో ఆమె స్వాగ్, బలమైన నటనతో కట్టిపడేసింది.ఈ చిత్రం తర్వాత మరాఠీలో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ చేసి తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు ఆమెకు భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2016లో ‘సైరత్’ చిత్రంలో అరంగేట్రం చేసింది. జూన్ 3, 2001న షోలాపూర్ సమీపంలోని అక్లుజ్ గ్రామంలో జన్మించిన రింకు ఇప్పుడు మరాఠీతో పాటు హిందీలోనూ నటనలో తనదైన ముద్ర వేస్తోంది. నెట్టింట చాలా యాక్టివ్ గా ఉండే రింకు నిత్యం తన క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Source link