Headlines

Renu Desai: 21 ఏళ్ల వయసులో రేణూ దేశాయ్ ఎలా ఉన్నారో చూశారా? త్రో బ్యాక్ ఫొటోను షేర్ చేసిన అందాల తార

Renu Desai: 21 ఏళ్ల వయసులో రేణూ దేశాయ్ ఎలా ఉన్నారో చూశారా? త్రో బ్యాక్ ఫొటోను షేర్ చేసిన అందాల తార


సుమారు 20 ఏళ్ల గ్యాప్ తర్వాత 2023 లో టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు రేణూ దేశాయ్. ఇందులో ఆమె పోషించిన హేమలతా లవణం పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో రేణూ మూళ్లీ సినిమాల్లో కొనసాగుతుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. టైగర్ నాగేశ్వర రావు సినిమా రిలీజై రెండేళ్లు పూర్తయ్యాయి. ఇప్పటిదాకా మరే సినిమాను ప్రకటించలేదు రేణూ దేశయ్. అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తన సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నాడీ అందాల తార. ముఖ్యంగా మహిళలు, మూగజీవాల సంక్షేమం తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇందుకోసం తన కూతురు ఆద్య పేరిట ఒక ఎన్జీవోనూ కూడా స్థాపించారు. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు రేణూ దేశాయ్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటున్నారు. తన పిల్లల ఫొటోలను కూడా అందులో పంచుకుంటున్నారు. అలా తాజాగా రేణూ దేశాయ్ షేర్ చేసిన తన త్రో బ్యాక్ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.

రేణూ దేశాయ్ 21ఏళ్ల వయసులో ఉన్నప్పటి ఫొటోను ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. ఈ ఫొటోలో రేణు చాలా సన్నగా అందంగా ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దాన్ని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రేణూ మేడమ్ అప్పట్లో నే చాలా అందంగా ఉన్నారంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రేణూ దేశాయ్ షేర్ చేసిన త్రో బ్యాక్ ఫొటో..

Actress Renu Desai

Actress Renu Desai

కాగా రేణూ దేశాయ్ కుమారుడు అకీరా నందన్ కూడా త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టవచ్చుననే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమాలో అకీరా ఒక కీలక పాత్ర చేశాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అకీరాను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు తహతహలాడుతున్నారు.

రేణూ దేశాయ్ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *