బంగారం ధరలు అనేవి రోజు రోజుకు పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా మంది ఎక్కువగా కొనడానికి ఇష్టపడే దాంట్లో బంగారమే ముందుంటుంది. కానీ ప్రస్తుతం గోల్డ్ రేట్స్ అనేవి ఆకాశాన్నంటుతున్నాయి. రోజు రోజుకు ధరలు పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే గోల్డ్ రేట్స్ లక్షమార్క్ దాటిన విషయం తెలిసిందే. కాగా, నేడు శుక్ర వారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఆగస్టు 8, 2025న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,560 గా ఉండగా,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.94,010గా ఉంది.
ఆగస్టు 07, 2025 శుక్రవారం (నిన్న)24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,550గా ఉండగా,నేడు రూ.10 పెరగడంతో గోల్డ్ రేట్ రూ.102,560గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.94,000గా ఉండగా, నేడు రూ.10 పెరగడంతో గోల్డ్ రేట్ రూ.94,010గా ఉంది.
ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,560ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.94,010 లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,27,000లుగా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,02,560 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.94,010లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,20,000 లుగా ఉంది.వరంగల్ జిల్లాలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,02,560, 22 క్యారెట్ల ధర 94,010లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,27,000లుగా ఉంది.