Horoscope Today: వీరు రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది.. శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే

Horoscope Today: వీరు రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది.. శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే


మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ రాశివారికి ఆదాయం బాగా పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవు తుంది.  ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి రాబడి బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్ప డుతుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆహార, విహారాల్లో అతి జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవు తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు ఈ రాశివారి మీద నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఊహిం చని స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరు ద్యోగు లకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు వెడతాయి. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యం అనుకూ లంగా ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొందరు బంధుమిత్రుల వల్ల మిత్రుల వల్ల ఇబ్బంది పడతారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

సకాలంలో ఉద్యోగ బాధ్యతలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు చవి చూస్తారు. ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఏ పనైనా శ్రమతో పూర్తవుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చుల్ని అదుపు చేసుకోవడం మంచిది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. బంధువుల రాకపోకలు ఉండ వచ్చు. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది.  సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక, వ్యక్తి గత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్య మైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, జీవితంలో ఉన్నవారికి బాగా డిమాండ్ ఏర్పడుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కలుగుతాయి. తలపెట్టిన ప్రతి ప్రయత్నం విజయ వంతం అవుతుంది. కొందరు బంధువులతో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సమ స్యలు సర్దుమణుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ జీవితంలో సానుకూలతలు పెరుగుతాయి. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి సంపాదన పెరుగుతుంది. వ్యాపారాల్లో మీ ఆలోచనలు ఫలించి, లాభాల పంట పండుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఉద్యోగం లభించే అవ కాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. తోబుట్టువులతో విభేదాలు తొలగిపో తాయి. పిల్లల నుంచి సానుకూల సమాచారం అందుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. ఆర్థిక ప్రయ త్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. నిరుద్యోగులకు విదేశీ కంపె నీల నుంచి సైతం ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి. ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలంగా మారుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెల కొంటుంది. గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. బంధువుల నుంచి ఆశించిన శుభ వార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో పనిభారం పెరిగినా ఫలితం ఉంటుంది. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభి స్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ స్థిరత్వం ఏర్పడుతుంది. ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు చాలావరకు తొలగిపోతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ, ఖర్చులు పెరగడం వల్ల ఇబ్బంది పెడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. బంధువులతో సఖ్యత పెరుగుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *