సుమారు 2,05,000 మంది ఆహారపు అలవాట్లను 30 ఏళ్లకు పైగా పరిశీలించి, అధ్యయనం చేసిన తర్వాత ఈ విషయాన్ని నిర్థారించినట్టు హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు తెలిపారు.
30 ఏళ్లలో మొత్తం 2,05,000 మంది ఆహారపు అలవాట్లను పరిశీలించగా వారిలో 22,299 మంది డయాబెటిస్ బారిన పడినట్లు గుర్తించారు. వారి ఆహారపు అలవాట్లను పరిశీలించినప్పుడు ఫ్రెంచ్ ప్రైజ్ తినండం కారణంగానే వాళ్లు డయాబెటీస్ బారిన పడినట్టు కనుగొన్నారు.
అయితే ఈ అధ్యయనం ద్వారా డయాబెటీస్ వస్తుందని కనుగొన్న పరిశోదకులు ఇందుకు పరిష్కారాన్ని కూడా సూచించారు. మన ఫుడ్లో ఫ్రెంచ్ ఫ్రైస్కు బదులుగా తృణధాన్యాలను తీసుకోవడం ద్వారా డయాబెటిస్ 19 శాతం వరకు తగ్గుతుందని తెలిపారు.
ఈ అధ్యయనాన్ని చేపట్టిన ప్రొఫెసర్ వాల్టర్ విల్లెట్ మాట్లాడుతూ మన రోజువారీ ఆహారంలో చేసుకునే కొన్ని మార్పులే ఈ డయాబెటిస్ పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని అన్నారు. ఫ్రెంచ్ ఫ్రైస్ను వినియోగాన్ని తగ్గించి, తృణధాన్యాలను తీసుకోవడం ద్వారా మధుమేహం ముప్పును తగ్గించవచ్చని తెలిపారు.
అయితే, ఉడకబెట్టినా లేదా బేక్ చేసినా ఆలుగడ్డలను తినడం వల్ల అలాంటి ప్రమాదమేమీ ఉండదని పరిశోధకులు స్పష్టం చేశారు.( గమనిక: పైన పేర్కొన్నా అంశాలు నివేదికలు, నిపుణుల సలహాల మేరకు మాత్రమే అందిచబడ్డాయి. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి)