క్రికెట్‌ లోకమా ఊపరిపీల్చుకో.. కోహ్లీ, రోహిత్‌ తిరిగోస్తున్నారు! మ్యాచ్‌ తేదీ ఖరారు..

క్రికెట్‌ లోకమా ఊపరిపీల్చుకో.. కోహ్లీ, రోహిత్‌ తిరిగోస్తున్నారు! మ్యాచ్‌ తేదీ ఖరారు..


విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వీరాభిమానులకు ఇది పండగలాంటి వార్త అనే చెప్పాలి. టీ20, టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చిన తర్వాత కేవలం వన్డే ఫార్మాట్‌కే పరిమితమైన విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మను ఆటను యావత్‌ క్రికెట్ ప్రపంచం మిస్‌ అవుతోంది. వారు ఆడుతుంటే చూడాలని.. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ ఎదురుచూపులకు త్వరలోనే తెరపడనుంది. రోకో జోడి బరిలోకి దిగే తేదీ ఖరారైంది. ఆ మ్యాచ్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కోహ్లీ, రోహిత్ మళ్లీ భారత జెర్సీని ధరించడాన్ని చూడటానికి మీరు రెండు నెలలకు పైగా వేచి ఉండాల్సి ఉంటుంది. అక్టోబర్ 19న ప్రారంభమయ్యే ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఈ జంట తిరిగి ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు.

  • ఇండియా vs ఆస్ట్రేలియా మొదటి వన్డే: అక్టోబర్ 19 – పెర్త్
  • ఇండియా vs ఆస్ట్రేలియా 2వ ODI: అక్టోబర్ 23 – అడిలైడ్
  • ఇండియా vs ఆస్ట్రేలియా 3వ ODI: అక్టోబర్ 25 – సిడ్నీ

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా మైదానంలో కనిపించారు. అక్కడ వారు భారతదేశం టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. జట్టుకు నాయకత్వం వహించిన రోహిత్, న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో 83 బంతుల్లో 76 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్‌కు కీలక పాత్ర పోషించాడు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అదే సమయంలో కోహ్లీ 5 మ్యాచ్‌ల్లో 218 పరుగులతో తన కన్సిస్టెన్సీకి మారుపేరుగా నిలిచాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *