Okra Water Benefits : బెండకాయలను రాత్రంతా నీటిలో నానబెట్టండి.. ఉదయం తాగితే ఫుల్ బెనిఫిట్స్..

Okra Water Benefits : బెండకాయలను రాత్రంతా నీటిలో నానబెట్టండి.. ఉదయం తాగితే ఫుల్ బెనిఫిట్స్..


Okra Water Benefits : బెండకాయలను రాత్రంతా నీటిలో నానబెట్టండి.. ఉదయం తాగితే ఫుల్ బెనిఫిట్స్..

బెండకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే, ఈ బెండకాయల్ని రాత్రి నీళ్లల్లో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవటం అనేది ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. నాలుగు లేదా ఐదు తాజా బెండకాయలు తీసుకుని బాగా కడగాలి. తర్వాత బెండకాయలను సగం లేదా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఓ గ్లాసులో వేయాలి. ఇందులో నీళ్లు నింపి రాత్రంతా ఫ్రిజ్‌‌లో ఉంచాలి. ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లలోని బెండకాయలు తీసేసి వాటర్ తాగాలి. ఇలా చేయడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

బెండకాయల్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతుంది. బెండకాయ వాటర్ తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. తద్వారా షుగర్ ముప్పు నుంచి రక్షించుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు రోజూ ఓ గ్లాసు ఈ వాటర్ తాగితే చాలా మంచిది. బెండకాయ నీటిలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ ఓ గ్లాసు బెండకాయ వాటర్ తాగడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు.

బెండకాయ వాటర్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ ఓ గ్లాసు బెండకాయ వాటర్ తాగడం మంచిది. బెండకాయ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. తద్వారా చర్మం యవ్వనంగా, అందంగా ఉంటుంది. బెండకాయ వాటర్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కీళ్లలో వాపు, మంట ఏర్పడకుండా అడ్డుకుంటాయి. తద్వారా కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఆర్థరైటిస్ నుంచి కాపాడుకోవచ్చు.

బెండకాయ వాటర్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడతాయి. తద్వారా గుండెకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో హృదయ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతాయి. బెండకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి శరీర కణాలను రక్షిస్తాయి. క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి. తద్వారా క్యాన్సర్ ముప్పు నుంచి రక్షించుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *