సాయంత్రం వేళ పెరుగు తింటున్నారా..? ఈ సమస్యలు కోరి కొనితెచ్చుకున్నట్టే..!

సాయంత్రం వేళ పెరుగు తింటున్నారా..? ఈ సమస్యలు కోరి కొనితెచ్చుకున్నట్టే..!


పెరుగు అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. నిజానికీ పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పెరుగులో ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్లు, మినరల్స్ ఇలా శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎముకలకి చాలా మంచిది. అయితే, సాయంత్రం తర్వాత పెరుగు తినకూడని నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం తరువాత పెరుగు తినడం వల్ల తొందరగా జీర్ణమవ్వదని చెబుతున్నారు. దీంతో అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇంతకు ముందే జీర్ణ సమస్యలు ఉన్నవారు పెరుగు సాయంత్రం తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

సాయంత్రం తర్వాత పెరుగు తింటే ముక్కు, గొంతులో శ్లేష్మం (మ్యూకస్) ఎక్కువగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆస్తమా ఉన్నవారు పెరుగు తినకపోవడమే మంచిది. రాత్రిపూట పెరుగు తింటే శరీరంలో ఇంఫ్లమేషన్ సమస్య పెంచే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కీళ్లలో మంట, వాపు సమస్యలు ఏర్పడొచ్చు. సాయంత్రం లేదా రాత్రిపూట పెరుగు తినడం వల్ల కడుపు ఉబ్బరంగా ఉండి సరిగా నిద్రపట్టదు. దీంతో నిద్రలేమి సమస్య ఉత్పన్నమవుతుంది.

పెరుగు తినడం వల్ల గొంతులో శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. ఇది దగ్గు సమస్యను పెంచుతుంది. దీంతో రాత్రిపూట దగ్గు ఎక్కువవుతుంది. అందుకే దగ్గు ఉంటే పెరుగు తినకపోవడమే మేలు. సాయంత్రం తర్వాత ఫ్రిజ్‌లో ఉంచిన పెరుగు తినడం ద్వారా నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది తలనొప్పికి కారణమవుతుంది. అందుకే రాత్రి పెరుగు తినకూడదు. సాయంత్రం తప్ప పెరుగు ఎప్పుడైనా తినొచ్చు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో లేదా లంచ్ సమయంలో పెరుగు తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. పెరుగులో కాల్షియం, ప్రోటీన్ మెండుగా ఉంటాయి. ఇవి ఎముకలు, కండరాలను బలంగా ఉంచుతాయి. అలాగే జీర్ణ సమస్యలు దూరం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందువల్ల పెరుగు రోజులో ఒకసారి తినడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *