
హైదరాబాద్ వాసులూ.. బిగ్ అలర్ట్.. ఎటుచూసినా నీళ్లే.. కుండపోత వర్షంతో నగరం అంతా నీటిమయమైంది.. గురువారం రాత్రి.. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.. దారి కనిపించలేనంతగా కురిసిన వానతో.. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో, పంజాగుట్ట, అమీర్‌పేట, SR నగర్, షేక్ పేట, మణికొండ.. ఇలా అన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.. పలు ప్రాంతాల్లో గాలి దుమారం బీభత్సం సృష్టించింది.. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది.. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. భారీ వర్షాల నేపథ్యంలో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి..
అయితే.. అర్థరాత్రి వరకూ వర్షం కురిసే అవకాశం ఉందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఇళ్లల్లో ఉన్న వారు బయటకు రావొద్దని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్నిశాఖలకూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పబ్లిక్‌కి సూచించారు.