Indigo Plane : ఎగురుతున్న విమానంలో రెచ్చిపోయిన ప్రయాణికుడు..ఏం చేశాడో చూడండి!

Indigo Plane : ఎగురుతున్న విమానంలో రెచ్చిపోయిన ప్రయాణికుడు..ఏం చేశాడో చూడండి!


తాజాగా ముంబయినుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానంలో తోటి ప్రయాణికుడిపై దాడికి తెగబడ్డాడు మరో ప్రయాణికుడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబయి నుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానంలో తనతోపాటు ప్రయాణిస్తున్న మరో వ్యక్తిపై చేయి చేసుకున్నాడు ఓ ప్రయాణికుడు. చెంపపై బలంగా కొట్టడంతో అతడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. దీంతో విమానంలో ఒక్కసారిగా గందరగోళం తలెత్తింది. ఇద్దరు విమాన సిబ్బంది బాధిత వ్యక్తిని ముందుకు తీసుకొస్తున్న క్రమంలో నిందితుడు బాధితుడి చెంపను మరోసారి చెళ్లుమనిపించాడు. దీంతో ఇతర ప్రయాణికులు అతడిని గట్టిగా ఎదుర్కొన్నారు. ఆ వ్యక్తిని అసలెందుకు కొట్టారని నిలదీశారు. అతడి వల్ల తనకు సమస్య ఎదురైనందుకే కొట్టానని అతను చెప్పడంతో ప్రతి ఒక్కరికీ సమస్యలు ఎదురవుతాయి, అంతమాత్రాన చేయి చేసుకుంటారా?అంటూ వెనక నుంచి మరో వ్యక్తి ప్రశ్నించారు. ముందుగానే విమానాశ్రయ అధికారులకు సమాచారమిచ్చిన పైలట్‌.. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్‌ కాగానే నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనోడే మొట్టమొదటి హీరో…! NTRతో అట్లుంటది మరి!

కామెర్లు ముదిరి కన్నడ స్టార్ హీరో మృతి.. షాక్‌లో కన్నడ ఇండస్ట్రీ!

సారథి స్టూడియోలో గొడవ.. షూటింగ్‌ను అడ్డుకుని కార్మికుడిని కొట్టిన యూనియన్ లీడర్

Renu Desai: రాజకీయ నాయకుల గురించి రేణు దేశాయ్‌ షాకింగ్ పోస్ట్.. ఆలా ఎలా అనేసింది

OTT ఆశలపై నీళ్లు చల్లిన ప్రొడ్యూసర్.. సక్కగా థియేటర్‌కు నడవాల్సిందే ఇక!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *