ఏపీ చరిత్రలోనే తొలిసారి.. భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఓ పనికి రూ.5 కోట్లు డిమాండ్ చేసిన అధికారి.. నోట్ల కట్టలతో అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.. భారీగా నగదుతో ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది. ఇంత పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేయడంతో.. బాధితుడి సైతం నోరెళ్ళ బెట్టాడు.. చివరకు ఏసీబీ అధికారులను సంప్రదించడంతో.. అతని ఆగడాలకు చెక్ పెట్టారు.. ఏపీ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేసి పట్టుబడ్డ ఆ అధికారి ఎవ్వరు..? ఎసిబి అధికారులు ఏమంటున్నారు..? వివరాలను తెలుసుకోండి..
విజయవాడలో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు.. ఒకటి కాదు రెండు కాదు.. రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేసి మొదటి విడతలో25 లక్షలు తీసుకుంటూ ఎసిబికి దొరికిపోయాడు. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్లో చీఫ్ ఇంజనీర్ గా పని చేస్తున్న సబ్బవరం శ్రీనివాస్ పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు 5 కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను సంప్రదించాడు.. ఇది విన్న అధికారులు.. ఆ తిమింగలం గురించి తెలుసుకుని అవాక్కయ్యారు.
భీమవరానికి చెందిన సత్యసాయి కన్స్ట్రక్షన్స్ అధినేత కృష్ణం రాజు ఏజెన్సీ ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ స్కూల్ నిర్మించే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా, ఉపాధి, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులను ఖర్చు చేస్తాయి. అందులో భాగంగానే ఏకలవ్య మోడల్ స్కూల్ నిర్మించే కాంట్రాక్ట్ దక్కించుకున్న కృష్ణం రాజు వాటిని నిబంధనల మేరకే వాటిని నిర్మిస్తూ వస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో అవి దాదాపు పూర్తవ్వగా వాటికి సంబంధించిన నిర్మాణాలు వివిధ స్టేజిలో ఉన్నాయి. పూర్తి చేసిన వాటికి బిల్లులు ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా.. ట్రైబల్ వెల్ఫేర్ ఈయన్సీగా ఉన్న శ్రీనివాస్ ఏదో ఒక కొర్రి పెడుతూ వచ్చారు.
ఈ క్రమంలోనే.. శ్రీనివాస్ కాంట్రాక్టు కృష్ణంరాజుకు బిల్లులు క్లియర్ చేస్తానని ఆఫర్ ఇచ్చాడు. అయితే 5 కోట్లు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 30 కోట్లకు 5 కోట్లు లంచం ఇస్తే ఇంకా తనకు వచ్చేది.. ఏమి ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు కృష్ణం రాజు.. చివరకు చేసేదేం లేక ఏసీబీని ఆశ్రయించారు. దీనితో వల పన్ని 25 లక్షల లంచం తీసుకుంటున్న తరుణంలో.. ఎసిబి అధికారులు పట్టుకున్నారు. అనంతరం కెమికల్ టెస్టులు చేసి డబ్బును సీజ్ చేశారు.. శ్రీనివాస్ ను అరెస్టు చేసి.. రిమాండ్ కు పంపించారు.
శ్రీనివాస్ అరెస్టు తరువాత కీలక వ్యాఖ్యలు చేశారు ఎసిబి అధికారులు.. ఎసిబి చరిత్రలో ఇంత మొత్తంలో లంచం డబ్బులు తీసుకుంటూ పట్టుబడిన సందర్భం లేదన్నారు. శ్రీనివాస్ పై అనేక అవినీతి ఆరోపణలు.. అక్రమ ఆస్తుల కేసులు ఉన్నాయని తెలిపారు. అయినా చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ తన తీరు మార్చుకోలేదన్నారు. లంచం ఇవ్వడం తీసుకోవడం రెండు నేరమేనని.. ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..