అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఛలో సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ చిన్నది, ఈ మూవీలో తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకుని, తర్వాత వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది.
ముఖ్యంగా ఛలో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని, గీతా గోవిందం సినిమాతో మంచి యూత్‌లో క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈ అమ్మడును అవకాశాలు వరించాయి. వరసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ముఖ్యంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా ఇలా ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడంతో లక్కీ హీరోయిన్గా మారిపోయింది. ఇక ఈ మధ్య రిలీజైన సికిందర్ ఫ్లాప్ అయినప్పటికీ ఈ అమ్మడు క్రేజ్ మాత్రం ఏ మాత్రం దగ్గలేదు. ప్రస్తుతం ఈ చిన్నది రష్మిక ది గర్లఫ్రెండ్, రెయిన్బోది సినిమాల్లో నటిస్తుంది.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తన క్యూట్ క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ..కుర్రకారు మనసు దోచేస్తుంది.
ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్లో బ్లాక్ అండ వైట్ డ్రెస్‌లో ఉన్న పలు ఫొటోలు షేర్ చేసింది. అందులో రష్మిక చాలా క్యూట్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.