Headlines

Rakhi 2025: రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముడులు వేయాలో తెలుసుకోండి..ఒక్కో ముడికి ఒక్కో అర్థం ఉందట..!

Rakhi 2025: రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముడులు వేయాలో తెలుసుకోండి..ఒక్కో ముడికి ఒక్కో అర్థం ఉందట..!


ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగను అత్యంత ప్రేమ, భక్తి భావాలతో జరుపుకుంటారు.. ఎందుకంటే..ఈ పండుగ అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముడి మధ్య ప్రేమానురాగలకు ప్రతీక. రాఖీ పండుగను కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు. ఇక్కడ అన్న చేతికి చెల్లెలు, తమ్ముడి చేతికి అక్క రాఖీ కడుతుంది. వారు చిరకాలం సుఖ సంతోషాలు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటుంది. అందుకు బహుమతిగా తమ సోదరులు కానుకలు సమర్పించుకుంటారు. అయితే, అన్నాచెల్లెళ్లు రాఖీ కట్టినప్పుడు ఎన్ని ముడులు వేయాలో కూడా తెలుసుకోవాలి. ఇది వారి ప్రేమకు, రక్షణకు ప్రతీకలా నిలుస్తుందని జ్యోతిశాష్య, వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ యేడు రాఖీ పండుగ ఆగస్టు 9న వచ్చింది. ఆరోజు భద్రకాలం కూడా లేదని పండితులు చెబుతున్నారు. గతేడాది రాఖీ పండుగ వేల ప్రజలు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఎందుకంటే.. రాఖీ ఈ సమయంలో మాత్రమే కట్టాలి. ఆ సమయంలో మాత్రమే కట్టాలంటూ పలు రకాల పుకార్లు షీకార్లు కొట్టాయి. కానీ, ఈ యేడు అలాంటివేవి లేనందుకు సంతోషించాలి. రాఖీపౌర్ణమి రోజున పౌర్ణమి సమయంలో ఎప్పుడైనా మీరు రాఖీని కట్టవచ్చు అంటున్నారు.

తెల్లవారు సూర్యోదయం నుండే రాఖీ పండుగను నిర్వహించుకోవడం మొదలు పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే రాఖీ కట్టడానికి సోదరి… తన సోదరుడి మణికట్టుపై ప్రేమ దారాన్ని కడుతుంది. అదే రాఖీ. రాఖీ కట్టేటప్పుడు మూడు ముడులు వేయడం శుభప్రదం అని పండితులు చెబుతారు. మొదటి ముడి సోదరుడికి దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుందని, రెండవ ముడి కట్టిన సోదరికి దీర్ఘాయుష్షును అందిస్తుందని, ఇక మూడవ ముడి వారి సంబంధంలో మాధుర్యాన్ని పెంచుతుందనే భావనతో ఇలా మూడు ముడులు వేసి రాఖీని కట్టాలని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే, ముందుగా సోదరుడి నుదట బొట్టు పెట్టాలి. అది కూడా ఉంగరపు వేలితోనే పెట్టడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత ఆ బొట్టుపై బియ్యపు గింజలు కూడా వేసి సోదరుడికి దీర్ఘాయుష్షు కావాలని కోరుకోవాలి. రాఖీ కట్టిన తరువాత తప్పనిసరిగా నోరు తిపి చేస్తూ మిఠాయిలు తినిపించాలి. ఇలా చేయడం వల్ల వారిద్దరి జీవితంలోని తీయని క్షణాలు, ఆనందాలు రెట్టింపు అవుతాయని విశ్వసిస్తారు.

ఇకపోతే, రాఖీ కట్టేప్పుడు సరైన దిశను కూడా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రక్షాబంధన్ రోజున రాఖీ కట్టేటప్పుడు సోదరి పశ్చిమ దిశ వైపు, సోదరుడు ఈశాన్య దిశ వైపు ఉండడం మంచిది. ఆ దిశలోనే కూర్చుని ఉండి, కుడి చేతి మణికట్టుపైన రాఖీ కట్టాలని చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల అన్ని రకాలుగా మేలు జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *