Bigg Boss: బిగ్ బాస్‌లోకి లెస్బియన్ కపుల్.. ఈ అమ్మాయిల ప్రేమ కథలో ఎన్ని ట్విస్టులో..

Bigg Boss: బిగ్ బాస్‌లోకి లెస్బియన్ కపుల్.. ఈ అమ్మాయిల ప్రేమ కథలో ఎన్ని ట్విస్టులో..


బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ సీజన్ మళ్లీ ప్రారంభమైంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం తదితర ప్రముఖ భాషల్లో త్వరలోనే ఈ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఇందుకోసం అన్ని భాషల్లోనూ విస్తృతంగా సన్నాహకాలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ తెలుగు విషయానికి వస్తే.. ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 07 నుంచి తొమ్మిదో సీజన్ ప్రారంభం కానుందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది. సాధారణంగా బిగ్ బాస్ రియాలిటీ షో లో ఎక్కువగా సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, ఫేమస్ యూట్యూబర్లు పాల్గొంటారు. అలాగే కామన్ మ్యాన్ కేటగిరీ కూడా ఉంటుంది. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఒక క లెస్బియన్ జంట అడుగు పెట్టింది. ఇప్పుడు అందరూ వీరి గురించే మాట్లాడుకుంటున్నారు. మలయాళ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 7’ ఇటీవలే ప్రారంభమైంది. సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హోస్ట్ చేస్తున్న ఈ రియాలిటీ షో లో సినీనటులతో పాటు పలువురు సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. అయితే ఈ సారి అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం అదీలా, ఫాతిమా అనే లెస్బియన్ జంట.

కేరళ కు చెందిన అదీలా, ఫాతిమా సౌదీ అరేబియాలోనే ఎక్కువగా ఉంటున్నారు. వీరి మొదటి పరిచయం అక్కడే జరిగింది. ఇంటర్ చదివేటప్పుడు మొదటి సారిగా కలుసుకున్నారు. మొదట ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఆ తరువాత వారి స్నేహం ప్రేమగా చిగురించింది. ఇద్దరూ కలిసి జీవితాంతం కలిసి జీవించాలనుకున్నారు. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇద్దరినీ విడదీయాలని నిర్ణయించుకున్నారు. కానీ అంత కన్నా ముందే అదీలా, ఫాతిమా తమ ఇళ్లను వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఇవి కూడా చదవండి

 బిగ్ బాస్ షోలో మోహన్ లాల్ తో..

ఫాతిమాతో తన ప్రేమ వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకోవాలని అదీలా నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ఆమె కేరళ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఫాతిమాను తన ఇష్టానికి విరుద్ధంగా తీసుకెళ్లారని అందులో అదీలా ఆరోపించింది. అంతేకాదు మత మార్పిడీ చేయించే ప్రయత్నం చేశారని పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన కేరళ హైకోర్టు, ఇద్దరితోనూ ఒంటరిగా మాట్లాడి వారి కోరిక మేరకు వారికి కలిసి జీవించే హక్కును కల్పించింది. LGBTQ+ వర్గం కూడా వారికి మద్దతుగా నిలిచింది.

కాగా న్యాయస్థానం అనుమతి ఇచ్చినప్పటికీ నెట్టింట ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్నారు అదీలా, ఫాతిమా. అయితేనేం వాటిని పట్టించుకోకుండా తమకు నచ్చినట్లు జీవిస్తున్నారు. తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆసక్తికరమైన విషయాలు, వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ షోలో ప్రవేశించడం ద్వారా తమ ప్రేమ కథను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఒక మంచి అవకాశం దొరికింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *