చైనాలో వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ సమయంలో హృదయాన్ని హత్తుకునే వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వరదలో చిక్కుకున్న వ్యక్తి తన ప్రాణాలను పట్టించుకోకుండా.. ముందుగా తన భార్యను కాపాడమని రెస్క్యూ టీంను వేడుకుంటున్న దృశ్యం కనిపిస్తుంది. ఈ 27 సెకన్ల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రజలను భావోద్వేగానికి గురిచేసింది.
ఉత్తర చైనాలో కుండపోత వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు తీవ్ర వరదల గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఈ వరదలో ఒక జంట చిక్కుకుంది. ఈ దంపతులను రక్షించడానికి రెస్క్యూ టీం వారి వద్దకు వెళ్ళినప్పుడు.. భర్త వెంటనే.. నా భార్యకి ఈత రాదు.. ప్లీజ్ ఆమెని ముందు రక్షించండి. అని వేడుకున్నాడు. నా గురించి చింతించకండి, నేను బాగున్నాను. నాకు ఈత కొట్టడం తెలుసు. కనుక మీరు మొదట ఆమెను సురక్షితంగా బయటకు తీసుకెళ్లండి” అని అన్నాడు.
భర్త ఇలా చెప్పిన వంటనే రెస్క్యూ టీం మొదట ఆ మహిళను వరద ప్రవాహం నుంచి రక్షించి సురక్షితంగా బయటకు తీసుకువెళ్ళింది. తరువాత భర్తను కాపాడింది. దీని తరువాత ఇద్దరూ సురక్షిత ప్రాంతానికి చేరుకున్న వెంటనే భార్తభర్తలు ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు.
ఇవి కూడా చదవండి
వరదలో చిక్కుకున్న తర్వాత ఇద్దరూ చాలా భయపడ్డామని భర్త లియు చెప్పాడు. తన భార్యకు ఈత రాడానికి దీంతో ఏడవడం ప్రారంభించిందని చెప్పాడు. దీంతో భర్తగా నేను నా భార్యని కాపాడడమే మొదటి బాధ్యత గా భావించినట్లు చెప్పాడు. లియు దంపతులు తమని రక్షించిన రెస్క్యూ టీమ్‌కు కూడా కృతజ్ఞతలు తెలిపాడు.
వరదలో చిక్కుకున్న వీడియో ఇక్కడ చూడండి
ఈ వీడియో సోషల్ మీడియాలో అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. రెడ్‌నోట్ అనే ప్లాట్ఫామ్లో ఇంతగా ప్రేమించే భర్త ఉండటం ఆ భార్య అదృష్టం అని ఒకరు.. చాలా మంది కష్ట సమయాల్లో వెళ్లిపోతారు.. అయితే ఎటువంటి పరిస్థితి ఎదురైనా మనకు తోడుగా నిలబడే వ్యక్తులు కొందరు ఉంటారని వ్యాఖ్యానించారు. మరొకరు అగ్నిమాపక సిబ్బందికి సెల్యూట్.. అయితే భర్త బాధ్యత, ఆలోచన నా హృదయాన్ని తాకిందని చెప్పాడు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..