ఇండస్ట్రీకి హీరోయిన్ దొరికేసిందిరోయ్..! పచ్చళ్ల పాప పిచ్చెక్కించిందిగా.!

ఇండస్ట్రీకి హీరోయిన్ దొరికేసిందిరోయ్..! పచ్చళ్ల పాప పిచ్చెక్కించిందిగా.!


గతంతో పోల్చుకుంటే ఇప్పుడు హీరోయిన్ అవకాశాలు అందుకోవడం కొంత సులభం అయ్యిందనే చెప్పాలి. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది హీరోయిన్స్ పరిచయం అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకు సినిమాల్లో అవకాశాలు పెరిగాయి. ఇన్ స్టా గ్రామ్ వీడియోలు, యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా క్రేజ్ సొంతం చేసుకొని ఆతర్వాత హీరోయిన్స్ గా వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే దీపికా పిల్లి, వైష్ణవి చైతన్య, చాందిని చౌదరి ఇలా చాలా మంది ముద్దుగుమ్మలు సోషల్ మీడియా నుంచి హీరోయిన్స్ గా మారిన వారే.. ఈ లిస్ట్ లోకి ఇప్పుడు మరో ముద్దుగుమ్మ వస్తుందంటున్నారు నెటిజన్స్. ఆమె ఖచితంగా హీరోయిన్ అవుతుంది అంటూ బల్లగుద్ది చెప్తున్నారు. ఇంతకూ ఆమె ఎవరో కాదు.. పికిల్స్ పాప రమ్య మోక్ష..

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

ఆలేఖ చిట్టి పికిల్స్.. రీసెంట్ డేస్ లో బాగా పాపులర్ అయ్యింది ఈ పేరు. పచ్చళ్ళ వ్యాపారం మొదలు పెట్టిన ముగ్గురు అక్కా చెల్లెళ్ల గురించి తెలియని వారు ఉండరు. సోషల్ మీడియా ద్వారా తమ పికెల్స్ ను పాపులర్ చేసుకున్నారు ఈ ముగ్గురు. అయితే పికిల్స్ రేటు గురించి ఓ నెటిజన్ అడగడం.. తన్ని ఇష్టమొచ్చినట్టు తిట్టడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వీరి పై నెటిజన్స్ విరుచుకుపడ్డారు. దాంతో బిజినెస్ మూసేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఆతర్వాత మళ్లీ మొదలుపెట్టారు.. ఇదిలా ఉంటే వీరిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మాత్రం రమ్య గురించే..

ఇవి కూడా చదవండి

రమ్య మోక్ష.. ఈ చిన్నది తన అందంతో కుర్రకారును కవ్విస్తుంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రీల్స్ కు మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే ఓ సినిమాలో నటించింది రమ్య మోక్ష.. అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న వచ్చిన వారు గౌతమ్ అనే సినిమాలో నటించింది. అంతకు ముందుకూడా కొన్ని సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే రమ్య త్వరలోనే బిగ్ బాస్ లోకి అడుగుపెడుతుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ అమ్మడి పేరు ఖరారైందని అంటున్నారు. ఇదిలా ఉంటే రమ్య సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేసింది. ఈ చిన్నది షేర్ చేసే వర్కౌట్ వీడియోలు కుర్రాళ్లను కవ్విస్తున్నాయి. పక్క హీరోయిన్ మెటిరీయల్, ఈ బ్యూటీ హీరోయిన్ అవ్వడం గ్యారెంటీ అంటున్నారు నెటిజన్స్. ఇండస్ట్రీకి హీరోయిన్ దొరికేసిందిరోయ్ అంటున్నారు కుర్రాళ్ళు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *