చిరు మాదిరి లీకిచ్చిన రజినీ.. పాపం! లోకేష్!

చిరు మాదిరి లీకిచ్చిన రజినీ.. పాపం! లోకేష్!


ఇప్పుడు చిరు అండ్ నాగ్ మాదిరే రజినీ కూడా కూలీ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ లీక్‌ ఇచ్చాడు. నాగ్ ఆంటోని క్యారెక్టర్ ఎలా సాగుతుందో.. మాట్లాడుతూ మాట్లాడుతూ చెప్పేశాడు. కూలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వీడియో రూపంలో తన స్పీచ్ పంపించిన రజినీ.. ఆ వీడియోలో.. నాగ్ తో వర్కింగ్ ఎక్స్‌పీరియస్ గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు రజినీ. సినిమాలో తనకు అన్నిన్నిటికంటే పెద్ద సర్ ప్రైజ్.. నాగ్‌ విలన్‌గా చేయడమేనని అన్నాడు. విలన్ క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్ అని.. అందుకే కథ విన్నప్పుడు తానే విలన్ గా చేయాలనీ అనుకున్నట్టు చెప్పాడు. కానీ లోకి సడెన్‌గా వచ్చి.. మన సినిమాలో నాగార్జున విలన్‌గా చేస్తున్నాడని చెప్పగానే షాక్ అయ్యా అంటూ చెప్పుకొచ్చాడు సూపర్ స్టార్ రజినీ. విలన్ గా నాగ్ అదరగొట్టేశాడంటూ లీక్ ఇచ్చారు రజినీ. నాగ్ పర్ఫార్మెన్స్‌ చూశాక తాను కూడా చేయలేనేమో అనిపించిందన్నాడు. బాషా సినిమాలో ఎలాగైతే ఓ ఆంటోని పాత్ర ఉంటుందో, నాగ్ పాత్ర కూడా అలానే ఉంటుందంటూ బిగ్ లీక్ ఇచ్చాడు రజినీ. దీంతో నాగ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే విషయం అందరీకీ తెలిసిపోయింది. నిజానికి నాగ్ క్యారెక్టర్ ను లోకి ఎప్పటి నుంచో దాస్తూ వస్తున్నాడు. కానీ కింగ్ సగం లీక్ చేస్తే.. రజినీ మరింత లీక్ చేసి.. లోకి ప్లాన్‌ను డిస్సపాయింట్ చేశారు. కానీ నాగ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు. తమ హీరోకు రజినీని మించి పవర్‌ ఫుల్ రోల్ పడిందని… సంబరపడిపోతున్నారు. రజినీ మాటలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాగ్‌లోని గొప్ప విషయం అదే! కింగ్‌ను ఆకాశానికెత్తిన రజినీ..

నోరు జారిన రజినీ.. తప్పుడబుతున్న రాజమౌళి ఫ్యాన్స్

నేను నో చెప్పినా లోకేష్‌ వెంట పడ్డాడు.. కానీ ఆ ఒక్క విషయంలోనే బాధ

షాకింగ్ కిడ్నాప్ డ్రామా.. అసలు సంగతి తెలిసి పోలీసుల షాక్‌

వరదల్లో కొట్టుకుపోయిన 20 కోట్ల నగలు.. ఎగబడిన జనం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *