వెన్నెముకలో వణుకు పుట్టించే అరుదైన లోతైన సముద్ర జీవి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో కనిపించింది. ఈ జీవి దంతాలు రాక్షసుడిలా పదునైనవిగా, వంకరటింకరగా ఉన్నాయి. కానీ, దాని కళ్ళు మాత్రం ముత్యాల వలె ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. పెద్ద సైజు ముత్యాల లాంటి కళ్ళతో దూరం నుండి దాని ఎరను గుర్తించగలదు.. కాబట్టి శాస్త్రవేత్తలు దీనికి టెలిస్కోప్ ఫిష్ అని పేరు పెట్టారు. శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ జీవి కళ్ళు బయో-కాంతిమను గ్రహించే ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని చెబుతున్నారు.. ఈ జీవి తన కళ్ళ నుండి కాంతిని ఉత్పత్తి చేయగలదు. తద్వారా సముద్రంలోని దట్టమైన చీకటిలో కూడా చాలా దూరం సులభంగా చూడగలదు. ఈ జీవి 500 నుండి 3000 మీటర్ల లోతులో నివసిస్తుంది.
టెలిస్కోప్ చేప తన గొట్టం లాంటి కళ్ళలో కాంతిని నిల్వ చేయగలదు. ఇది ఎరను కనుగొనడంలో సహాయపడుతుంది. దాని శరీరం పొడవుగా, సన్నగా ఉంటుంది. తెలుపు- గోధుమ రంగులో ఉంటుంది. ఈ వైరల్ వీడియోలో టెలిస్కోప్ చేప బెలూన్ లాంటి కళ్ళు, పదునైన దంతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూసేందుకు ఇది చాలా భయంకరంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి
వీడియో ఇక్కడ చూడండి..
Telescopefish, a rare deep-sea creature known for its eyes adapted for spotting bioluminescence
— Science girl (@gunsnrosesgirl3) July 31, 2025
ఈ ప్రత్యేకమైన సముద్ర జీవి వీడియోను @gunsnrosesgirl3 అనే హ్యాండిల్ ఎక్స్‌ఖాతాలో షేర్ చేశారు.. దీనిని ఇప్పటివరకు 20 మిలియన్లకు పైగా వీక్షించారు. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ తిన్నామంటూ కామెంట్ చేశారు. చాలా మంది నెటిజన్లు భయాందోళనకు గురవుతున్నారు.
ఈ టెలిస్కోప్ చేపల ఆవిష్కరణను శాస్త్రవేత్తలు చాలా ఉత్తేజకరమైనదిగా అభివర్ణించారు. ఇలాంటి జీవుల ఆవిష్కరణ సముద్రపు లోతుల్లో దాగి ఉన్న మరిన్ని రహస్యాలను వెల్లడించగలదని వారు విశ్వసిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి