
బిగ్ అలెర్ట్.. ఉద్యోగులు అందరూ వాన ప్రారంభం అవ్వకముందే ఇళ్లకు వెళ్లిపోవడం మంచింది. ఎందుకంటే హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టనుంది. దక్షిణ దిశ నుంచి భారీ క్యూములోనింబస్ మేఘాలు సిటీపై అలుముకుంటున్నాయి. దీంతో రాబోయే ఒక గంటలో రాజేంద్రనగర్, చార్మినార్, ఎల్బీనగర్, అబిడ్స్ సహా పలు ప్రాంతాల్లో మోస్తరు మిగులు వానలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. వర్షానికి తోడు పిడుగులు పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
సోమవారం నగరంలో వరుణుడు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. సాయంత్రం కురిసిన వానకు నగరవాసులు చాలా ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారిపోయింది. చాలా ప్రాంతాల్లో నీరు నిలిచి.. జనం ఇబ్బందులు పడ్డారు. అందుకే మీరు ఆఫీసుల్లో ఉంటే.. మీ బాస్‌లను అడిగి ఇళ్లకు వెళ్లి వర్క్ చేయండి.
హైదరాబాద్ వర్ష/ఫ్లడ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు:
- GHMC డిజాస్టర్ రిస్పాన్స్ ఫోర్స్ (DRF): 040-29555500, 9000113667
- GHMC మెయిన్ కంట్రోల్ రూమ్: 040-21111111
- హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్: 9010203626
- తెలంగాణ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కంట్రోల్ రూమ్: 1070 (టోల్ ఫ్రీ)
- ఎలక్ట్రిసిటీ సమస్యలకోసం — TSSPDCL (తెలంగాణ స్టేట్ సదన్ పవర్ డిస్ట్రిబ్యూషన్): 1912, 1800-425-0025
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి