Viral Video: స్పైస్ జెట్ ఉద్యోగుల దాడి కేసులో ట్విస్ట్?… తొలుత ఆర్మీ అధికారిపైనే సిబ్బంది దాడి చేసినట్లు చూపించే మరో వీడియో

Viral Video: స్పైస్ జెట్ ఉద్యోగుల దాడి కేసులో ట్విస్ట్?… తొలుత ఆర్మీ అధికారిపైనే సిబ్బంది దాడి చేసినట్లు చూపించే మరో వీడియో


స్పైస్‌జెట్ ఉద్యోగిపై దాడి కేసులో ట్విస్ట్ ఇది. ఎయిర్‌లైన్ సిబ్బంది మొదట ఆర్మీ అధికారిపై దాడి చేసినట్లు మరో వీడియో వైరల్‌ అవుతోంది. శ్రీనగర్ నుండి ఢిల్లీకి వెళ్లే SG-359 విమానం బోర్డింగ్ గేట్ వద్ద నలుగురు స్పైస్‌జెట్ ఉద్యోగులపై సీనియర్ ఆర్మీ అధికారి తీవ్రంగా దాడి చేసిన వీడియో వైరల్ అయిన ఒక రోజు తర్వాత, ఈ సంఘటనకు సంబంధించిన మరొక వీడియో వెలుగులోకి వచ్చింది.

కొత్త వీడియో చూడండి:

తాజాగా వైరల్‌ అవుతోన్న వీడియోలో ఎయిర్‌లైన్ సిబ్బంది మొదట లెఫ్టినెంట్ కల్నల్‌ను కొట్టినట్లు ఆ తర్వాత ఆర్మీ అధికారి ప్రతీకారం తీర్చుకున్నట్లు చూడవచ్చు. వీడియోలో, ఆర్మీ అధికారిని నేలపైకి నెట్టివేసినట్లు, ఆపై అతను ప్రతీకారం తీర్చుకున్నట్లు, ఎయిర్‌లైన్ సిబ్బందిపై దాడి చేసినట్లు కనిపిస్తోంది. ఈ మొత్తం సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా చెప్పుకుంటున్న X యూజర్, ఆర్మీ అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు ఎయిర్‌లైన్ సిబ్బందిని నిందించాడు.

“బోర్డింగ్ గేట్ వద్ద నేను ఈ సంఘటనను చూశాను. కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా 8–9 కిలోల క్యాబిన్ బ్యాగ్‌తో ఒంటరిగా ప్రయాణిస్తున్న అధికారి చెక్-ఇన్ సమయంలో అతని బ్యాగ్‌ను క్లియర్ చేశారు. ముందస్తు అనుమతి ఉన్నప్పటికీ, గేట్ వద్ద, 4–5 మంది స్పైస్‌జెట్ సిబ్బంది బ్యాగ్ బరువు గురించి అతనితో దూకుడుగా మాట్లాడారు. అతను ప్రశాంతంగా వివరించాడు. బరువును తగ్గించడానికి వస్తువులను తీసివేసాడు. కానీ సిబ్బంది అతన్ని ఎగతాళి చేస్తూ “ఆజ్ ఆర్మీ వాలా ఫన్సా హై” అన్నారని దేశ్ బంధు పాండే అనే X యూజర్ రాశాడు.

“అతను సీనియర్ అధికారిని అడిగినప్పుడు, వారు నిరాకరించారు. ఈ క్రమలో ఒక చిన్న గొడవ జరిగింది. సిబ్బందే మొదట ఆర్మీ ఆఫీసర్‌ను గాయపర్చారు. అతను సిబ్బందిపై “దాడి” చేశాడనే వాదనలు అబద్ధం అని రాసుకొచ్చాడు. ఆ అధికారి ఉత్తర కాశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. స్పైస్‌జెట్ ఉద్యోగులపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆ అధికారిని గుల్మార్గ్‌లోని హై-ఆల్టిట్యూడ్ వార్‌ఫేర్ స్కూల్‌కు అటాచ్ చేశారు.

ఆగస్టు 3న వెలుగులోకి వచ్చిన పాత వీడియో:

ఆగస్టు 3న శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో లగేజీ విషయంలో ఓ ఆర్మీ అధికారికి, ఎయిర్​లైన్స్​ సిబ్బందికి మధ్య వివాదం చెలరేగింది. మాట మాట పెరిగి చివరికి చేయిచేసుకునే వరకూ వెళ్లింది. ఈ గొడవలో సిబ్బందికి గాయాలు అయ్యాయి. ఈ దాడిలో గాయపడ్డ సిబ్బంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఎయిర్​లైన్స్​ అధికారులు తెలిపారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ప్రకారం ఆర్మీ అధికారిపై తొలుత ఎయిర్‌లైన్స్‌ సిబ్బందే దాడి చేసినట్లు చూపిస్తుండటంతో కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *