“ఇక్కడ పిల్లి ఉండాలిగా.. అదేదీ?’అని చిన్నారిని అడగగా, ‘నా వద్దకు ఏ పిల్లీ రాలేదు. అయితే.. ఆ కిటికీ దగ్గర ఏదో ఉంది’ అని ఆ చిన్నారి జవాబు చెప్పింది. ఆ మాట వినగానే.. పాప తల్లిదండ్రులకు కొన్ని రోజుల క్రితం చనిపోయిన తమ పెంపుడు పిల్లి గుర్తొచ్చింది. దీంతో.. వారి చనిపోయిన పెంపుడు పిల్లే.. పాప మీద ప్రేమతో ఆత్మ రూపంలో వచ్చిందని నెటిజన్లు ఊహించుకుంటున్నారు.ఈ ఘటనపై చాలామంది తమ అనుభవాలూ షేర్ చేశారు. “నాకూ మా పెట్ చనిపోయిన కొన్నాళ్ల వరకు అలాగే అనిపించేది’అని ఒకరు కామెంట్ పెట్టారు. “పిల్లలకి కనిపించే అలాంటి వాటిని మనం లైట్ తీసుకుంటాం గానీ.. వాటిలో చాలా నిజం ఉంటుంది’అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఒకవేళ అది నిజంగా ఆ పిల్లి ఆత్మే గనక అయితే.. అది ఏదో చెడు నుంచి ఆ చిన్నారిని కాపాడటానికే వచ్చి ఉంటుంది’అని ఇంకో నెటిజన్ రాసుకొచ్చారు. అయితే ఈ సంఘటన సరిగ్గా ఎక్కడ, ఎప్పుడు జరిగింది అనే సమాచారం లేకున్నా.. ఈ వీడియో మాత్రం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ క్లిప్ ఎవరో కావాలని క్రియేట్ చేసిందని.. మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :