ఉత్తరాఖండ్ ఉత్తర్‌కాశీ జిల్లా థరాలీ గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది.. క్లౌడ్ బరస్ట్‌తో మెరుపు వరదలు గ్రామాన్ని ముంచేత్తాయి.. ఖీర్ గంగా నది భారీ ఎత్తున ఉప్పొంగింది.. దీంతో చాలా మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు.. పదుల సంఖ్యలో గృహాలు వరద బురద మేట కింద కూరుకుపోయారు. చాలా మంది గల్లంతయ్యాయరని.. శిధిలాల్లో మరికొందరు చిక్కుకున్నారని.. అధికారులు పేర్కొంటున్నారు. వెంటనే ఘటనాస్థలానికి సహాయ బృందాలను తరలించారు. ఇప్పటి వరకు 60 మందికిపైగా గల్లంతు అయ్యారని.. పేర్కొంటున్నారు. వీరిలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో తెలియలేదు. ఉత్తరకాశిలోని హర్సిల్ ప్రాంతంలోని ఖీర్ గఢ్ నీటి మట్టం పెరగడం వల్ల, ధరాలిలో అపారనష్టం వాటిల్లిందని.. దీంతో పోలీసులు, ఎస్‌డిఆర్‌ఎఫ్, సైన్యం, ఇతర విపత్తు ప్రతిస్పందన బృందాలు సంఘటన స్థలంలో సహాయ కార్యకలాపాలలో నిమగ్నమయ్యాయని.. ఉత్తరకాశి పోలీసులు తెలిపారు.
వీడియో చూడండి..
ఉత్తరకాశిలో క్లౌడ్ బరస్ట్ సంఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆందోళన వ్యక్తంచేశారు. “ఉత్తరకాశిలోని ధరాలిలో క్లౌడ్ బస్ట్ సంఘటన గురించి నాకు సమాచారం అందింది… మేము ప్రజలను రక్షించడానికి కృషి చేస్తున్నాము. జిల్లా యంత్రాంగం అధికారులతో మాట్లాడాను.’’ అని పుష్కర్ సింగ్ ధామి అని పేర్కొన్నారు. ఏపీలోని తిరుపతిలో ఉన్న ఆయన ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు.
‘‘ధరాలి (ఉత్తరకాశి) ప్రాంతంలో మేఘావృతం కారణంగా భారీ నష్టం సంభవించిందనే వార్త చాలా విచారకరం.. బాధాకరం. SDRF, NDRF, జిల్లా యంత్రాంగం, ఇతర సంబంధిత బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలలో నిమగ్నమై ఉన్నాయి. ఈ విషయంలో, నేను సీనియర్ అధికారులతో నిరంతరం సంప్రదిస్తున్నాను.. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాను. అందరి భద్రత కోసం నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు.