సినీపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కన్నడ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్న సంతోష్ బాలరాజు కన్నుమూశారు. కొన్ని రోజులుగా కామెర్లతో బాధపడుతున్న ఆయన బనశంకరిలోని సాగర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో, ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజుల క్రితం కోమాలోకి వెళ్లిపోయిన సంతోష్ బాలరాజు.. వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తుదిశ్వాస విడిచారు. సంతోష్ బాలరాజు వయసు ప్రస్తుతం 38 సంవత్సరాలు. కరియా 2, గణప వంటి చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. సంతోష్ బాలరాజు మృతిపై సినీప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Tollywood: పొలిటికల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.. టాలీవుడ్లో క్రేజీ హీరో.. ఇంతకీ ఆ స్టార్ ఎవరంటే..
కొన్ని రోజుల క్రితం సంతోష్ బాల్‌రాజ్‌కు కామెర్లు వచ్చాయి. కామెర్లు ఆయన శరీరమంతా వ్యాపించాయి. గత రెండు రోజులుగా ఆయనకు కృత్రిమ శ్వాసక్రియ అందిస్తున్నారు. కాలేయం, మూత్రపిండాల సమస్యల కారణంగా కామెర్లు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలోనూ ఆయనకు ఈ సమస్య వచ్చిందని.. అప్పుడు చికిత్స తీసుకోవడంతో కామెర్లు తగ్గాయి. కానీ ఈసారి పరిస్థితి చేయి దాటిపోయింది. సంతోష్ బాలరాజ్ తండ్రి అనేకల్ బాలరాజ్ ప్రముఖ నిర్మాత. కన్నడలో పలు సినిమాలు నిర్మించారు.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి: Serial Actress: తస్సాదియ్యా అమ్మడు.. సీరియల్స్ మానేసింది.. ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తోంది..
సంతోష్ బాలరాజు ఇంకా వివాహం చేసుకోలేదు. అతడికి తల్లి, సోదరి ఉన్నారు. ‘కెంపా’ సినిమా ద్వారా సంతోష్ బాలకరాజ్ సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘కరియా 2’, ‘జన్మ’, ‘గణప’ సినిమాల్లో నటించారు. గత సంవత్సరం అనేకల్ బాలరాజ్ మరణించారు. ఇప్పుడు సంతోష్ కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. సంతోష్ నటించిన ‘బర్కిలీ’, ‘సత్యం’ సినిమాలు ఇంకా విడుదల కాలేదు.
ఇవి కూడా చదవండి: Cinema: ఏం సినిమా రా బాబూ.. ఏకంగా 17400 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్..
Actress : ఒక్క సినిమాతో ఫేమస్.. ముద్దు సీన్ అనగానే గుక్కపెట్టి ఏడ్చేసింది.. దెబ్బకు ఆఫర్స్ గోవిందా..