బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరో అరుదైన ఘనత సాధించి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. తన నటనా ప్రతిభతో ఇప్పటికే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ నటి, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఓ సరికొత్త రికార్డును నెలకొల్పింది. దీపికా పదుకొణె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక రీల్ ఏకంగా 190 కోట్ల (1.9 బిలియన్) వీక్షణలు సాధించి, ప్రపంచంలోనే అత్యధికంగా చూసిన రీల్ గా రికార్డు సృష్టించింది.
ఏంటి ఆ రికార్డు?
తాజాగా దీపికా పదుకొణె ఒక అంతర్జాతీయ హోటల్ చైన్ కోసం గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా ‘ఇట్ మ్యాటర్స్ వేర్ యు స్టే’ అనే ప్రచారంలో భాగంగా ఒక రీల్ ను పోస్ట్ చేసింది. కేవలం ఎనిమిది వారాల్లోనే ఈ రీల్ 190 కోట్ల వీక్షణలను దాటింది. సాధారణంగా బ్రాండ్ ప్రమోషన్ లకు ఇంత భారీ స్థాయిలో వ్యూస్ రావడం చాలా అరుదు. అయితే దీపికా గ్లోబల్ స్టార్ డమ్, ఆమెకున్న 80 మిలియన్ల మంది ఫాలోవర్స్ కారణంగా ఇది సాధ్యమైంది.
ఈ రికార్డుతో దీపికా పదుకొణె, గతంలో అత్యధిక వ్యూస్ సాధించిన క్రికెటర్ హార్దిక్ పాండ్యా (1.6 బిలియన్ వ్యూస్), ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో (500 మిలియన్ లకు పైగా వ్యూస్) వంటి దిగ్గజాలను అధిగమించింది. ఇది ఒక భారతీయ నటి సాధించిన అసాధారణ విజయం.
ఇవి కూడా చదవండి
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు..
ఇటీవలే హాలీవుడ్ ‘వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’ జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ నటిగా దీపికా పదుకొణె నిలిచింది. ఈ ఘనత సాధించిన కొన్ని నెలలకే ఇన్ స్టాగ్రామ్ లో ప్రపంచ రికార్డును సాధించడం ఆమె పెరుగుతున్న అంతర్జాతీయ గుర్తింపుకు నిదర్శనం. సోషల్ మీడియాలో ఆమెకున్న భారీ ఫాలోయింగ్, ఆమె కంటెంట్ పై ప్రజల్లో ఉన్న ఆసక్తి ఈ రికార్డును సాధించడంలో కీలక పాత్ర పోషించాయి.
ఇది దీపికా పదుకొణెకు మాత్రమే కాకుండా, భారతీయ సినిమా రంగానికి కూడా గర్వకారణమైన విషయం. ప్రపంచ స్థాయిలో మన తారలు ఎంత ప్రభావం చూపిస్తున్నారో ఇది మరోసారి రుజువు చేసింది. ఆమె నటన, అందం, వ్యక్తిత్వం… అన్నీ కలిసి ఆమెను ఒక గ్లోబల్ ఐకాన్ గా మార్చాయని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఈ రికార్డుతో దీపికా మరో మైలురాయిని అధిగమించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..