Astro Tips: ప్రతి రాశికి సొంత రంగు ఉంటుంది.. ఏ రాశికి చెందిన వ్యక్తులకు ఏ రంగు కారు కొనడం సురక్షితం అంటే..

Astro Tips: ప్రతి రాశికి సొంత రంగు ఉంటుంది.. ఏ రాశికి చెందిన వ్యక్తులకు ఏ రంగు కారు కొనడం సురక్షితం అంటే..


తాము వాహనంలో ప్రయాణించే సమయంలో సురక్షితంగా, ఇబ్బంది లేకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అటువంటి సమయంలో వ్యక్తిత్వం, జీవనశైలికి సరిపోయే కారు రంగును ఎంచుకోవడం మరింత ముఖ్యమైనది. ముఖ్యంగా మీరు దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్న సమయంలో రాశి ప్రకారం కారు రంగుని ఎంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని పండితులు సూచిస్తున్నారు. ప్రతి రాశికి దాని సొంత రంగు ఉంటుంది. ఇది సానుకూలతను తెస్తుంది. అందుకనే ఈ రోజు ఏ రాశి వారికీ ఏ రంగు కారు అదృష్టాన్ని తెస్తుందో తెలుసుకుందాం..

  1. మేష రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఎరుపు రంగు శుభప్రదమైనది. ఈ రంగు శక్తి, క్రూరత్వం, స్వచ్ఛతను సూచిస్తుంది. ఇది వీరి వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తుంది. మండుతున్న ఎరుపు(fiery red)తో పాటు, తెలుపు, పసుపు వంటి రంగులు కూడా మేషరాశికి అదృష్టాన్ని ఇస్తాయి.
  2. వృషభ రాశి: ఈ రాశికి చెందిన వారికి గులాబీ రంగు, తెలుపు రంగు అదృష్ట రంగులు. ఈ రంగు ముఖ్యంగా ఆర్థిక సంబంధిత విషయాలలో అదృష్టాన్ని తెస్తుంది. అలాగే ఆకుపచ్చ రంగు చక్కదనం, డబ్బుకు చిహ్నం. కనుక వృషభరాశి వారు ఆకుపచ్చ రంగు కారుని ఎంచుకుంటే అది వీరికి శుభప్రదమైన రంగు.
  3. మిథున రాశి: వీరికి లేత పసుపు, ఆకుపచ్చ రంగులు అదృష్ట రంగులు. ఈ రెండు రంగులు వీరి జీవితంలో అదృష్టాన్ని తెస్తాయి. జ్యోతిష్కులు ఈ రెండు రంగులు జీవితంలో సానుకూలతను, విజయాన్ని తెస్తాయని చెప్పారు. ఎవరికైనా ఈ రెండు రంగుల కార్లు నచ్చకపోతే.. అప్పుడు వీరు గులాబీ, తెలుపు వంటి రంగుల కార్లను కూడా ఎంచుకోవచ్చు ఎందుకంటే ఇవి కూడా వీరికి అదృష్టాన్ని తెస్తాయి.
  4. కర్కాటక రాశి: వీరు చాలా సున్నితమైన వ్యక్తులు. వీరికి వెచ్చదనం, పోషణ అవసరం. కనుక వీరు తెలుపు, బూడిద, వెండి, క్రీమ్ వంటి రంగులను ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఈ రంగులు వీరి సున్నితమైన, ప్రేమగల వ్యక్తిత్వానికి తెలియజేస్తాయి. తద్వారా వీరు ఈ రంగుల కారుని ఎంచుకోవడం వలన సురక్షితంగా ఉండవచ్చు.
  5. ఇవి కూడా చదవండి

  6. సింహ రాశి: ఈ రాశికి చెందిన వారు చాలా ధైర్యంగా, బలంగా ఉంటారు. బంగారు రంగు షేడ్స్ తో పాటు, ఊదా, నారింజ రంగు వీరి ధైర్యమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడంలో సహాయపడతాయి ఎందుకంటే ఈ రాశికి సూర్యుడు అధిపతి. వీరు పాలించటానికి జన్మించారు. ఈ రంగులు వీరి అద్భుతమైన స్వభావాన్ని నిర్వచించి, ఇతరుల ముందు వీరి ఉనికిని మరింత పెంచుతాయి.
  7. కన్య రాశి: వీరి రంగులు నీలం, ఆకుపచ్చ, పసుపు , తెలుపు. ఈ రంగులన్నీ వీరికి అదృష్ట రంగులుగా పరిగణించబడతాయి. ఎందుకంటే కన్య రాశికి చెందిన వ్యక్తులు ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రంగులు వీరి స్వభావాన్ని బట్టి నిర్వచించబడతాయి. కనుక ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ రంగుల కార్లు ఎంచుకుంటే అదృష్టవంతులు.
  8. తుల రాశి: వీరు ప్రకాశవంతమైన రంగులను ఎంచుకుంటే అది వీరికి చాలా అదృష్టం. తెలుపు, లేత నీలం వంటి కొన్ని ఆహ్లాదకరమైన రంగులు వీరి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయి. కనుక ఈ రాశికి చెందిన వ్యక్తులు బ్రైట్ కలర్స్ ని ఎంచుకోవచ్చు.
  9. వృశ్చిక రాశి: తెలుపు, ఎరుపు, గోధుమ రంగుల అన్ని షేడ్స్ ఈ రాశి వారికి శుభ రంగులు. ఈ రంగులు జీవితంలో దిశను కనుగొనడంలో సహాయపడతాయి. ఈ రాశికి చెందిన ఎవరైనా అదృష్టాన్నిచ్చే ఇతర రంగులను కోరుకుంటే నారింజ, పసుపు కూడా మంచి ఎంపిక. ఈ రంగు కార్లు వ్యక్తిగత, వృత్తి జీవితంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
  10. ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి ముదురు పసుపు ,నారింజ రంగులు శుభప్రదమైనవి. ఎందుకంటే ఈ రంగులు వీరికి హఠాత్తు ప్రవర్తన, చమత్కారమైన వ్యక్తిత్వానికి మద్దతు ఇస్తాయి. మంచుతో నిండిన నీలం లేదా మణి రంగులు కూడా వీరికి అదృష్ట రంగులు. ఈ రంగులు చెడు నుంచి వీరిని రక్షిస్తాయని నమ్ముతారు.
  11. మకర రాశి: మకర రాశి వారు కారు కొనాలంటే నలుపు, ఊదా, ముదురు గోధుమ, ఆకుపచ్చ రంగులను ఎంచుకోవాలి. ఈ రంగులు వీరికి అదృష్టాన్ని చేకూరుస్తాయి. ఈ రంగులను ఎంచుకోవడం వలన వ్యాపారం, జీవితంలో అధిక లాభాలను అందుకుంటారు. ఎందుకంటే ఈ రంగులు వీరికి ఆర్థిక విజయాన్ని ఇస్తాయి. వ్యక్తిత్వాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి.
  12. కుంభ రాశి: లేత నీలం, ఊదా, తెలుపు వంటి అన్ని ప్రకాశవంతమైన రంగులు కుంభ రాశి వారి వ్యక్తిత్వానికి సరిపోతాయి. అలాగే ఈ రంగులన్నీ వారి జీవితంలో సానుకూలతను తెస్తాయి. కుంభ రాశి వ్యక్తుల సృజనాత్మక వైపును ప్రదర్శించడానికి కూడా సహాయపడతాయి. ఈ రంగులు వారిని సంపూర్ణంగా నిర్వచించాయి.
  13. మీన రాశి: వీరు భావోద్వేగపరంగా సున్నితంగా, దయతో అవగాహన కలిగి ఉంటారు. కనుక పసుపు , నారింజ రంగులు వీరికి శుభప్రదంగా భావిస్తారు. ఈ రంగులు ఎవరికైనా నచ్చకపోతే వారు గులాబీ రంగును ఎంచుకోవచ్చు ఎందుకంటే గులాబీ అందమైన రంగు. వీరికి అదృష్టాన్ని తెస్తుంది. అంతేకాదు చాలా కాలంగా వెతుకుతున్న ప్రేరణ, అంతర్దృష్టిని పొందడానికి సహాయపడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *