వాస్తు నిబంధనల ప్రకారం రాఖీ కట్టాలి: రాఖీ పండగ అనేది సోదరుడు, సోదరి మధ్య విడదీయరాని బంధానికి చిహ్నం. వాస్తు శాస్త్రం ప్రకారం సోదరుడి మణికట్టుకి రాఖీ కట్టేటప్పుడు సరైన దిశ, సమయం, పద్ధతిని అనుసరించడం వల్ల సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. ఇది సోదరుడిని రక్షించడమే కాదు కుటుంబంలో ఆనందం, శాంతి, శ్రేయస్సును కూడా తెస్తుంది. వాస్తు ప్రకారం రాఖీ కట్టేందుకు నియమాలు, దాని ప్రయోజనాలను తెలుసుకుందాం.
రాఖీ కట్టడానికి శుభ సమయాన్ని ఎంచుకోండి: వాస్తు శాస్త్రంలో శుభ ముహూర్తానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రాఖీ పండగ రోజున రాఖీ కట్టడానికి పంచాంగం ప్రకారం శుభ సమయాన్ని ఎంచుకోండి. ఉదయం లేదా మధ్యాహ్నం సమయం ముఖ్యంగా భద్ర కాలం లేని సమయంలో రాఖీ కట్టడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. భద్ర కాలంలో రాఖీ కట్టడం అశుభం. ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. శుభ ముహూర్తంలో రాఖీ కట్టడం వల్ల సోదరుడి దీర్ఘాయువు లభిస్తుంది. శ్రేయస్సు నెలకొంటుంది.
ఏ దిశలో కట్టాలంటే: వాస్తు శాస్త్రంలో తూర్పు దిశ లేదా ఈశాన్య దిక్కు అత్యంత పవిత్రమైనది. సానుకూలమైనదిగా పరిగణించబడుతుంది. రాఖీ కట్టేటప్పుడు, సోదరుడు తూర్పు దిశకు ఎదురుగా కూర్చోవాలి. సోదరి అతని ముందు కూర్చోవాలి. మీ ఇంట్లోని పూజా గది ఈ దిశలో ఉంటే. అక్కడే సోదరుడికి రాఖీ కట్టండం మంచిది.
రాఖీ ప్లేట్ అలంకారం: వాస్తు ప్రకారం రాఖీ ని పెట్టే ప్లేట్ ని అలంకరించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ప్లేట్ మీద ముందుగా ఎరుపు లేదా పసుపు వస్త్రంతో అలంకరించండి. ఎందుకంటే ఈ రంగులు శుభాన్ని సూచిస్తాయి. తర్వత రాఖీ, కుంకుమ, గంధం, అక్షతలు, దీపం, స్వీట్లు, పువ్వులు ప్లేట్ లో ఉంచండి. దీపం వెలిగించేటప్పుడు ఆ దీపం, తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండేలా చూసుకోండి. ప్లేట్ పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించండి.
రాఖీ కట్టే సమయంలో ముడి ఎలా వేయాలంటే: వాస్తు శాస్త్రం ప్రకారం రాఖీని ముడి వేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కుడి చేయి శక్తి, కర్మకు చిహ్నం కనుక సోదరుడి కుడి మణికట్టుకి రాఖీని కట్టాలి. రక్షణ, నమ్మకాన్ని సూచించే విధంగా ముడిని గట్టిగా వేయాలి. రాఖీని కట్టే సమయంలో 'రక్షాబంధన మంత్రం' “యేన బద్ధో బలీ రాజా, దానవేంద్రో మహాబలః| తేన త్వా మభిబధ్నామి, రక్షే మా చలమాచల||” అనే మంత్రాన్ని పఠిస్తూ సోదరుడి రక్షణ, శ్రేయస్సును కోరుతూ రాఖీని కట్టాలి.
సోదరికి బహుమతులు: రాఖీ కట్టే సమయంలో మూడు ముడులు వేయడం శుభప్రదంగా భావిస్తారు. రాఖీ కట్టిన తర్వాత సోదరుడికి స్వీట్లు తినిపించి అనంతరం హారతిని ఇవ్వండి. దీని తరవాత సోదరుడు తన ఆర్ధిక శక్తికి అనుగుణంగా తన సోదరికి బహుమతులు ఇవ్వాలి. ఎందుకంటే ఇది ప్రేమ, శ్రేయస్సుకు చిహ్నం.
వాస్తు శాస్త్ర నియమాలను అనుసరిస్తూ జరుపుకునే రాఖీ పండగ శుభప్రదం అవుతుంది. శుభ ముహూర్తం, సరైన దిశ, రాఖీ ప్లేట్ అలంకరణ, ముడి వేసే విధానం, రాఖీ కడుతూ జపించే మంత్ర వలన తోబుట్టువుల మధ్య ఉన్న సంబంధం బలోపేతం అవుతుంది. ఈ చర్యలు ప్రతికూల శక్తిని తొలగించి కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు , శాంతిని తెస్తాయి.