Tollywood : ఎంప్లాయిస్ ఫెడరేషన్ Vs ప్రొడ్యూసర్స్.. చర్చలు కొలిక్కి వచ్చేనా..?

Tollywood : ఎంప్లాయిస్ ఫెడరేషన్ Vs ప్రొడ్యూసర్స్.. చర్చలు కొలిక్కి వచ్చేనా..?


30శాతం వేతనాలు పెంచాలని పట్టుబడుతోంది ఫెడరేషన్‌. అయితే, తెగేదాకా లాగితే ఏమవుతుందో ప్రాక్టికల్‌గా చూపిస్తామంటున్నారు ప్రొడ్యూసర్స్‌. సాఫ్ట్‌వేర్‌ శాలరీలిస్తున్నా ఈ గొంతెమ్మ కోరికలేంటంటూ.. మ్యాటర్‌ని సీరియస్‌గా తీసుకున్నారు. ఎవరితో ఎలా పనిచేయించుకోవాలో తమకు బాగా తెలుసని చెప్పడమే కాదు చేతల్లో చూపిస్తున్నారు. తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఓ అడుగు ముందుకు వేసి అనుభవం, ప్రతిభ కలిగిన వారికి మంచి అవకాశాలు కల్పిస్తామంటూ.. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. సినిమాటోగ్రాఫీ, ఎడిటింగ్‌, మేకప్‌, అర్ట్‌, పొడక్షన్ సహా అనేక విభాగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. రేపోమాపో తమ డిమాండ్లకు నిర్మాతలు అంగీకరించి తమ దారికి రాక తప్పదని ధీమాతో ఉన్న ఫెడరేషన్‌కు ఈ నిర్ణయం ఊహించని షాక్‌లాంటిది.

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

మిగతా రాష్ట్రాల సిన్మా ఇండస్ట్రీలకంటే టాలీవుడ్‌లో వేతనాలిస్తున్నామని కార్మికశాఖ దృష్టికి తీసుకెళ్లారు టాలీవుడ్‌ ప్రొడ్యూసర్స్‌. అయితే మూడేళ్లకోసారి 30శాతం వేతనాలు పెంచుతామన్న హామీని నిలబెట్టుకోవాల్సిందేనంటోంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెడరేషన్‌. 30శాతం వేతనాల పెంపు తమకు భారమంటున్నారు నిర్మాతలు. కానీ 2022లో దిల్‌రాజు సమక్షంలోనే ఈ ఒప్పందం కుదిరిందంటున్నారు సినీ కార్మికులు. జూన్‌లోనే గడువు ముగిసిందని, నాలుగుసార్లు లేఖలు రాసినా ఎలాంటి స్పందనా లేదన్నారు.

ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ షూటింగ్స్‌ బంద్‌కి పిలుపునివ్వటంతో సెట్స్‌పై ఉన్న మూవీ షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. షూట్‌ ఆగిపోవడంతో ఖర్చులు మరింత పెరుగుతాయి. సంబంధిత నటుల కాల్షీట్లు వృధా అవుతాయి, సినిమా సామాగ్రితో పాటు తదితర పనులకు అద్దెలు కూడా అదనపు భారంగా మారుతాయి.

ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *