వర్షాకాలంలో ఇళ్లలో రోకలి బండ, గాజుపురుగులు, వానపాములు, జెర్రులు వంటి జీవులు కనిపించడం సర్వసాధారణం. అయితే ఇంట్లో జెర్రి కనిపిస్తే దాని వెనుక కొన్ని నమ్మకాలున్నాయి. ఎరుపు, మెరూన్ లేదా నలుపు రంగులో కనిపించే ఈ జెర్రి చీకటి ప్రదేశాల్లో జీవిస్తుంది. నేలపై అత్యంత వేగంగా పాకుతుంది. .
జెర్రికి చాలా కాళ్ళు ఉంటాయి. దీంతో ఇది చాలా వేగంగా పాకుతుంది. ఇది విషపూరితమైన ప్రాణి కనుక దీనిని చూడగానే కుడుతుందేమో అనే భయంతో వాటిని చంపేస్తారు. అయితే ఈ జెర్రులు మనుషుల్ని కుట్టే సందర్భాలు బహు అరుదు. అంతేకాదు వాస్తు శాస్త్రం ప్రకారం జెర్రిని చంపడం చాలా అశుభం. ఎందుకంటే ఈ జెర్రిని రాహువుకి చిహ్నంగా భావిస్తారు.
ఇంట్లో వంటగదిలో జెర్రి పదే పదే కనిపిస్తే.. ఆ ఇంటికి వాస్తు దోషం ఉందని అర్థం చేసుకోవాలని సూచిస్తుందట. వాస్తు దోష నివారణ కోసం ముందు ఇంటిని శుభ్రంగా ఉంచడం ప్రారంభించండి. వాస్తు దోషాన్ని గుర్తించి దానిని తొలగించే ప్రయత్నం చేయాలని వాస్తు శాస్త్రం పేర్కొంది. ఎందుకంటే వంట గదిలో జెర్రి కనిపిస్తే.. ఇంటిలోని సభ్యుడు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతాడనడానికి సంకేతం కావచ్చు.
జెర్రి రాహువుకి చిహ్నంగా భావిస్తారు. ఈ జెర్రి ఇంటి ప్రధాన ద్వారం, టాయిలెట్ లేదా మెట్ల ముందు భాగంలో కనిపిస్తే.. ఆ వ్యక్తి జాతకంలో రాహువు బలహీన స్థితిలో ఉన్నాడని అర్థం. రాహువును బలోపేతం చేయడానికి జ్యోతిషశాస్త్ర నివారణలు చేయడం చేయండి.
అయితే జెర్రి కనిపించడం ఎప్పుడూ చెడుకు సంకేతం కాదు.. అది కనిపించే ప్రదేశం బట్టి ఫలితాలు ఉంటాయి. అవును జెర్రిని చూడటం ఎల్లప్పుడూ దురదృష్టానికి సంకేతం కాదు. పూజ గదిలో అది పాకుతూ కనిపిస్తే, అది ధన లాభం లేదా ఏదైనా శుభవార్తను సూచిస్తుంది. జెర్రి ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు కనిపిస్తే.. అది దానితో పాటు ఇంటిలోని ప్రతికూల శక్తిని బయటకు తీసుకుల్తుందని .. ఇంట్లో ఉన్న ఇబ్బందులను తొలగిస్తుందని నమ్మకం.
జెర్రి విషం కలిగిన ప్రాణి..అయినా అవి మనిషిని కాటు వేసిన సందర్భాలు తక్కువ. కరచినా ప్రాణాలు పోవు.. కనుక జెర్రి ఇంట్లో కనిపిస్తే వెంటనే చంపేయకుండా దానిని సురక్షితంగా బయటకు విసిరేయాలి. జెర్రిని చంపడం వలన రాహువు మీపై ఆగ్రహించవచ్చు. కనుక వాస్తు ప్రకారం జెర్రిని ఇంటి నుంచి బయటకు విసిరేయడం మంచిది.